Share News

గాలివాన.. బీభత్సం

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:46 AM

కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఆది వారం గాలివాన దుమారం బీభత్సం సృష్టిం చింది.

గాలివాన.. బీభత్సం
మేడేపల్లిలో నేలకూలిన వృక్షం..

విద్యుత్‌ స్తంభాలు.. నిలిచి పోయిన విద్యుత్‌ సరఫరా

నేలరాలిన మామిడి...రైతుల ఆవేదన

కుక్కునూరు/వేలేరుపాడు, ఏప్రిల్‌ 21 : కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఆది వారం గాలివాన దుమారం బీభత్సం సృష్టిం చింది. మధ్యాహ్నం వరకు భానుడి భగభగ లతో అల్లాడి పోయిన జనానికి తొలుత వర్షం ప్రారంభంతో కొంత ఉపశమనం లభించినా వర్షంతో పాటు గాలి బీభత్సంగా వీచడంతో బెంబేలెత్తారు. కుక్కునూరు మండలంలోని ఇసుకపాడు, లంకాలపల్లి గ్రామాల్లో వేగంగా వీచిన గాలికి రహదారి పక్కనే ఉన్న చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. విద్యుత్‌ సరఫరాకి అంతరాయం కలిగింది. స్థానికులే కొన్నిచోట్ల విరిగిన చెట్ల కొమ్మలను తొలగిం చారు. గాలికి మామిడి కాయలు నేలరాలడంతో రైతాంగం నష్టపోయారు. వేలేరుపాడు మండలం తిరుమలాపురంలో చెట్లతో పాటు విద్యు త్‌ స్తంభాలతో విరిగి కింద పడ్డాయి. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచి పోవడంతో ప్రమాదం తప్పింది. మేడేపల్లి వద్ద వృక్షాలు విరిగి రోడ్డుపై పడిపోవ డంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వేలేరుపాడు–రుద్రమకోట, వేలేరుపాడు–కొయిదా రహదారిపై భారీ వృక్షాలు నేల కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలకు మరింత ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Apr 22 , 2024 | 12:46 AM