సాగు నీరు అందించండి
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:02 AM
వరి సాగుకు నీరందించాలని ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు.

ఎండిన వరి చేలల్లో రైతుల ధర్నా
ఏలూరు రూరల్, ఏప్రిల్ 2: వరి సాగుకు నీరందించాలని ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. రూరల్ మండలం మల్కాపు రంలో నీరు లేక ఎండిన వరి చేలో రైతులు మోటార్‌సైకిళ్ళు నడిపి నిరసన తెలిపా రు. ఎండిన వరి దుబ్బులతో రైతులు, కౌలు రైతులు ధర్నా చేశారు. నీటి పారు దలశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే పంటలు ఎండిపోయాయని, ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ నెలరోజులుగా తాగు నీరు అందక పంట ఎండిపోతున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరించడం దుర్మా ర్గమని విమర్శించారు. కళ్ల ఎదుటే పంట ఎండిపోవడంతో ఆత్మహత్యలే శరణ్యమని కన్నీళ్లు పెట్టుకుంటున్నా పట్టించుకునే దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరే ట్‌కు కూతవేటు దూరంలో ఉన్న మల్కాపురంలో సాగునీరు అందక పంటలు ఎండుతున్నా కలెక్టర్, వ్యవసాయశాఖ, నీటిపారుదలశాఖ అధికారులు దృష్టిసారిం చకపోవడం సరికాదన్నారు. ధర్నాలో గుర్రాల శోభన్‌బాబు, ఆదాడ దుర్గారావు, జి.ఏడుకొండలు, లావేటి గోవిందు,శివన్నారాయణ, కె.అమ్మినాయుడు, పి.రాంబాబు, లంకా పండు, ఎన్.అప్పారావు, కె.రంగారావు తదితరులు పాల్గొన్నారు.
తాగునీరు లేక గొంతెండుతోంది
ఏలూరు టూటౌన్, ఏప్రిల్ 2: కుమ్మరిరేవు తాగునీటి సమస్య పరిష్కరించాలని సీపీఎం నాయకు లు బీ.సోమయ్య, జే.గోపి డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ కార్యాల యం వద్ద మంగళవారం ఖాళీ బిం దెలతో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. వేసవి ఆరంభంలోనే తాగు నీటి సమస్య ఎదురైందని, నెల రోజుల నుంచి మున్సిపల్ కుళాయిల్లో కలుషిత నీరు వస్తుందన్నారు. కుమ్మరిరేవు ప్రాంతంలో 200 కుటుంబాలు నీరు లేక దాహంతో అలమటిస్తున్నాయన్నారు. ట్యాంకర్ల ద్వారా తాగునీరు పంపిణీ చేయాల ని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ వెంకటకృష్ణకు వినతిపత్రం అందజే శారు. ఏసుబాబు, కళావతి, అప్పలనర్సమ్మ, సావిత్రి, బేబీ పాల్గొన్నారు.