Share News

వలంటీర్లకు జీతం కట్‌ !

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:09 AM

వైసీపీ ప్రభుత్వంలో అన్నీ తామై వ్యవహరిస్తున్న వలంటీర్లకు షాక్‌ తగిలింది. వారికి ఇచ్చే జీతంలో కోతలు విధించడంతో పలువురు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వలంటీర్లకు జీతం కట్‌ !

జంగారెడ్డిగూడెం, జనవరి 29 : వైసీపీ ప్రభుత్వంలో అన్నీ తామై వ్యవహరిస్తున్న వలంటీర్లకు షాక్‌ తగిలింది. వారికి ఇచ్చే జీతంలో కోతలు విధించడంతో పలువురు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి బయటకు చెప్పలేక.. మింగలేక కుమిలిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీ పరిధిలో పది సచివాలయాల పరిధిలో 219 మంది వలంటీర్లు ఉన్నా రు. గత అక్టోబరులో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే సరిగ్గా చేయలేదని వలంటీర్లకు జీతానికి సంబం ధించి బిల్లు పెట్టకపోవడంతో వారికి ఆ నెలలో జీతాలు అందలేదని తెలిసింది. డిసెంబరులో కచ్చితంగా ప్రతి వలంటీరు సచివాలయ అడ్మిన్‌, ఎడ్యుకేషన్‌ సెక్రటరీ వద్దకు వెళ్లి వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లో థంబ్‌ అటెండెన్స్‌ వేయించుకోవాలన్న నిబంధన వచ్చింది. ఆ నెలలో చాలామంది వలంటీర్లు థంబ్‌లు సరిగ్గా వేయ లేకపోయారు. దీనికి కారణం వారు సచివాలయాలకు వెళ్లిన సమయంలో అక్కడ వారు లేకపోవడం, సర్వేలు తదితరాల కారణాల వల్ల థంబ్‌ వేయలేనట్టు సమాచా రం. దీంతో డిసెంబరులో వలంటీర్ల జీతానికి కోత పడింది. అటెండెన్స్‌ ప్రకారం ఇచ్చే రూ.5వేలలో కోతలు పెట్టడంతో సుమారు రూ.1000 నుంచి రూ.2వేలకు పైగానే కోత గురైన వలంటీర్లు చాలామంది ఉన్నట్టు సమాచారం. వలంటీర్లపై ఎంతో నమ్మకం పెట్టుకున్న సీఎం జగన్‌కు చివరకు వలంటీర్ల నుంచి అసంతృప్తి తప్పని పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. దీనిపై ముని సిపల్‌ కమిషనర్‌ భవాని ప్రసాద్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు.

Updated Date - Jan 30 , 2024 | 12:09 AM