Share News

ముసుగు తొలగించారు

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:34 AM

వలంటీర్లను ఎన్నికల సంఘం పక్కన పెట్టడంతో అధికార పార్టీకి దిక్కు తోచడం లేదు. ఒత్తిడి చేసి కొన్నిచోట్ల వలంటీర్లను రాజీనామాలు చేస్తున్నారు.

ముసుగు తొలగించారు
ఉండి మండలం యండగండిలో రాజీనామా లేఖను గ్రామ కార్యదర్శి పవన్‌కుమార్‌కు అందిస్తున్న వలంటీర్లు

వలంటీర్లపై వైసీపీ నాయకుల ఒత్తిళ్లు

వివిధ చోట్ల పలువురు రాజీనామాలు

అత్తిలి, ఏప్రిల్‌ 5 : వైసీపీ నాయకులు తెర తొలగిస్తున్నారు. పార్టీ కార్యకర్తలనే వలంటీర్లుగా నియమించుకున్నారు. ఇప్పటివరకు సేవ అనే ముసుగులో ప్రభుత్వ సొమ్మును ఇచ్చి పోషించిన వలంటీర్లను ఎన్నికల సంఘం పక్కన పెట్టడంతో అధికార పార్టీకి దిక్కు తోచడం లేదు. ఒత్తిడి చేసి కొన్నిచోట్ల వలంటీర్లను రాజీనామాలు చేస్తున్నారు. ఎన్నికల వేళ వారిని ఉపయోగించుకునేదుకు వీలుగా స్కెచ్‌లు వేస్తున్నారు. కొంతమంది పరోక్షంగా సహకరిస్తామని రాజీనామాలు చేయబోమని చెబుతున్నారు. అయినా వారిపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా విధులకు దూరం చేస్తున్నారు. గౌరవ వేతనం మీదనే ఆధారపడిన వారు ఉద్యోగం మానేస్తే ఉపాధి దెబ్బతింటుందని వెనకడుగు వేస్తున్నారు. అలాంటి వారికి నేతలే ఆర్థికంగా భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం రెండు నెలల పాటు తామే ఇస్తామంటూ రంగంలోకి దింపుతున్నారు. ప్రభుత్వం వస్తే మిమ్మలనే నియమిస్తామని ఒప్పందం కుదుర్చుకుంటున్నారు.

57 మంది వలంటీర్ల రాజీనామా

ఆకివీడు/ అత్తిలి /ఉండి, ఏప్రిల్‌ 5: ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో పంతొమ్మిది మంది వలంటీర్లు శుక్రవారం రాజీనామా చేశారు. ఆకివీడు–3 సచివాలయానికి చెందిన వలంటీర్లు రాజీనామా చేశారని వీటిని ఉన్నతాధికారులకు పంపించనున్నట్టు ఎంపీడీవో వై.రామకృష్ణ తెలిపారు. అత్తిలి మండ లానికి చెందిన లక్ష్మీనారాయణపురం, స్కిన్నెరపురం, పాలూరు గ్రామాలకు చెందిన 28 మంది వలంటీర్లు రాజీనామా పత్రాలను సచివాలయ కార్య దర్శులకు అందజేశారు. ఉండి మండలం యండగండిలో పది మంది వలంటీర్లు రాజీనామాలు చేశారని గ్రామ కార్యదర్శి పవన్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Apr 06 , 2024 | 12:34 AM