Share News

ఆలమూరులో విష జ్వరాలు

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:56 PM

పెనుమంట్ర మండలం ఆలమూరులో వైరల్‌ ఫీవర్స్‌ విజృంభిస్తున్నాయి. దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చదలవాడ నాగరరాణిని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కోరారు. లండన్‌ పర్యటనలో ఉన్న ఆయనకు స్థానిక నాయకులు అందించిన సమాచారంతో ఆయన స్పందించి నేరుగా అక్కడి నుంచే కలెక్టర్‌తో మాట్లాడారు.

ఆలమూరులో విష జ్వరాలు
పీహెచ్‌సీలో రోగులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ రవికుమార్‌

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వివిధ కారణాలతో ముగ్గురి మృతి

వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టరు నాగరాణికి ఎమ్మెల్యే పితాని ఫోన్‌

పెనుమంట్ర, ఆగస్టు 21 : పెనుమంట్ర మండలం ఆలమూరులో వైరల్‌ ఫీవర్స్‌ విజృంభిస్తున్నాయి. అనేకమంది విష జ్వరాలతో పైవ్రేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరికొందరు ఆలమూరు పీహెచ్‌సీ (భట్లమ గుటూరు)ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స చేయించుకుంటు న్నారు.జ్వరాల బారిన పడి ప్రైవేట్‌ హాస్పటల్స్‌లో చేరిన ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చదలవాడ నాగరరాణిని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కోరారు. లండన్‌ పర్యటనలో ఉన్న ఆయనకు స్థానిక నాయకులు అందించిన సమాచారంతో ఆయన స్పందించి నేరుగా అక్కడి నుంచే కలెక్టర్‌తో మాట్లాడారు.

రోగులను పరిశీలించిన తహసీల్దార్‌

జ్వరాలతో ఆసుపత్రిలో చేరి వివిధ కారణాలతో మృతి చెందినవారి వివ రాలను పెనుమంట్ర తహసీల్దార్‌ రవికుమార్‌ వైద్యులు ప్రదీప్‌ కుమార్‌, అనిల్‌ కుమార్‌లను అడిగి తెలుసుకున్నారు.రాజమండ్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారని స్థానికంగా మరొకరు మృతి చెందారని వైద్యులు వివరించారు వీరిలో కాలా తిరపతయ్య (37) వైరల్‌ ఫీవర్‌తో జాయిన్‌ అయి కిడ్నీ ప్రాబ్లం ఉండటం కారణంగా మృతి చెందాడని తెలిపారు సత్తి గీత (48) జ్వరంతో బాధపడుతూ తెల్ల రక్తకణాలు క్షీణించడంతో రాజమండ్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో మృతి చెందినట్లు తెలిపారు. దిగమర్తి వెంకట నాగలక్ష్మి (45) జ్వరంతో బాధపడుతూ గుండెపోటు కార ణంగా రాజమండ్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు. ఆలమూరు పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న పీడితులను పరామర్శించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గ్రామంలో పారిశుధ్య చర్యలపై ఆరా తీశారు. పంచాయతీ కార్యదర్శి సుధారాణి, సిబ్బంది ఉన్నారు.

ఆలమూరు పీహెచ్‌సీలో 11 మందికి చికిత్స

ఆలమూరు పీహెచ్‌సీ (భట్లమగుటూరు)లో ఈ గ్రామం నుంచి రోజకు వంద నుంచి 120 మంది వరకు వైద్య నిమిత్తం వస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 11 మందికి వైద్యం అందిస్తున్నారు. ఆరుగురుకి టైఫాయిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 600 నుంచి 700 మంది పరీక్షలు చేయించుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 15 రోజులుగా వైద్యులు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి వైద్య సదుపాయం అందిస్తున్నా ఎందుకు జ్వరాలు అదుపులోకి రావడం లేదో వైద్యాధికారులకు అంతు చిక్కడం లేదని అంటు న్నారు. దీనిపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - Aug 21 , 2024 | 11:57 PM