Share News

చీకట్లో ఊళ్లు!

ABN , Publish Date - Mar 12 , 2024 | 01:15 AM

పోలవరం మండలంలో అన్ని పంచాయతీలు విద్యుత్‌ బిల్లులు చెల్లించక బకా యి పడడంతో సోమవారం విద్యుత్‌ శాఖ అధికారులు అయా పంచాయతీల విద్యుత్‌ కనెక్షన్లకు సరఫరా నిలిపివేశారు.

చీకట్లో ఊళ్లు!
వీధిలైట్లు వెలగక అంధకారంలో పోలవరం మెయిన్‌రోడ్‌

బిల్లులు చెల్లించలేదని పంచాయతీలకు విద్యుత్‌ కట్‌

వీధి దీపాలు వెలగక అంధకారంలో పోలవరం మండలం

చెల్లించని పంచాయతీల విద్యుత్‌ బిల్లులు

సరఫరా నిలిపివేసిన అధికారులు

పోలవరం, మార్చి 11 : పోలవరం మండలంలో అన్ని పంచాయతీలు విద్యుత్‌ బిల్లులు చెల్లించక బకా యి పడడంతో సోమవారం విద్యుత్‌ శాఖ అధికారులు అయా పంచాయతీల విద్యుత్‌ కనెక్షన్లకు సరఫరా నిలిపివేశారు. వీధి లైట్లు వెలగకపోవడంతో అన్ని పంచాయతీల్లో గాఢాంధకారం అలుముకుంది. పోలవరం, గూటాల, కొత్తపట్టిసీమ, పట్టిసీమ, ఇటుకల కోట, వింజరం, చేగొండపల్లి, ప్రగడపల్లి, ఎల్‌ఎన్‌డీపేట, తూటిగుంట, కొరుటూరు, గెడ్డపల్లి పంచాయతీల్లో విద్యుత్‌ నిలిపివేశారు. ఈ విషయంపై పట్టిసీమ, ప్రగ డపల్లి, పోలవరం పంచాయతీ సర్పంచ్‌లు మాట్లాడు తూ నిధుల లేమి కారణంగా బిల్లులు సకాలంలో చెల్లించ లేకపోయినట్టు తెలిపారు. దీనిపై విద్యుత్‌ శాఖ ఏఈ కొండా సత్యనారాయణని వివరణ కోరగా మూడేళ్లుగా అన్ని పంచాయతీలు విద్యుత్‌ బిల్లులు చెల్లించడం లేదని, వారం రోజులుగా పంచా యతీ లకు బకాయిల చెల్లింపు విషయంపై నోటీసులు పంపిం చామన్నారు. కోండ్రుకోట, జిల్లేళ్లగూడెం పంచాయతీలు మినహా మిగిలిన పంచాయతీలు బకాయిలు చెల్లించ లేదని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశామన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 01:15 AM