Share News

ప్రశ్నిస్తే నిర్బంధిస్తారా..

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:36 AM

ప్రశ్నించిన వారిని నిర్బంధించడం ప్రభుత్వా నికి పరిపాటి అయిందని సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రశ్నిస్తే నిర్బంధిస్తారా..
రావికంపాడులో రోడ్డుపై బైఠాయించిన సర్పంచ్‌లు

కామవరపుకోట, ఫిబ్రవరి 6: ప్రశ్నించిన వారిని నిర్బంధించడం ప్రభుత్వా నికి పరిపాటి అయిందని సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్పం చ్‌ల చాంబర్‌ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి కామవరపుకోట మండలం నుంచి వెళుతున్న సర్పంచ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. ఆడమిల్లి, రావికం పాడు సర్పంచ్‌లు గూడపాటి కేశవరావు, వేముల నాగేశ్వరరావును తడికల పూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రావికంపాడులో పలువురు సర్పంచ్‌లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమాల్లో టీడీపీ శ్రేణులు, పలువురు సర్పంచ్‌లు, స్థానికులు పాల్గొన్నారు.

సర్పంచ్‌ల అరెస్టు దారుణం : గన్ని

భీమడోలు, ఫిబ్రవరి 6: అసెంబ్లీ ముట్టిడికి బయలుదేరిన సర్పంచ్‌లను అరెస్టు చేయడం దారుణమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయు లు అన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం నుంచి పలువురు మహిళా సర్పం చ్‌లు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరగా వారిని అడ్డుకుని తుళ్ళూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని గన్ని అన్నారు. సర్పంచ్‌ల వ్యవస్థను నిర్వీర్యం చేసిన జగన్‌ పరిపాలనకు అనర్హుడన్నారు.

పెదవేగి: పంచాయతీ నిధులను ఇవ్వాలని కోరిన సర్పంచ్‌లను నిర్భంధించిన ప్రభుత్వ తీరుపై మాజీఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ధ్వజ మెత్తారు. సర్పంచ్‌లను నిర్భంధించడంపై ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లు పదవి చేపట్టిన దగ్గర నుంచి గ్రామాల్లో పారిశుధ్యం, డ్రెయిన్ల పరిశుభ్రత, తాగునీటి సరఫరా, వీధిలైట్లు నిర్వహణ వంటి వాటి ఖర్చులతో సర్పంచ్‌ల చేతిచమురు వదులుతోందని, ఈ మూడేళ్లలో ఒక్కో సర్పంచ్‌ లక్షల్లో ఖర్చుచేశారని, ఆ నిధులను ఇవ్వకుండా జగన్‌ ప్రభుత్వం సర్పంచ్‌ల జీవితాలతో ఆడుకుంటోందని ఆయన విమర్శించారు. పంచాయతీ నిధులను జగన్‌ ప్రభుత్వం అడ్డదారుల్లో బొక్కేస్తూ, నిధులివ్వమని అడిగినవారిని నిర్భంధిస్తూ రాక్షసానందం పొందుతోందన్నారు. పంచాయతీలకు న్యాయబ ద్దంగా రావాల్సిన నిధులు ఇవ్వమని వేడుకోవడానికి ఛలో అసెంబ్లీ చేపట్టిన సర్పంచ్‌లను గుమ్మం దాటకుండా గృహనిర్భంధాలు చేయడం దారుణమ న్నారు. జగన్‌కు నీతి, నిబద్దత ఉంటే ఇప్పటికైనా పంచాయతీ నిధులను తక్షణం జమ చేయాలన్నారు. గ్రామ ప్రథమ పౌరులు ప్రభుత్వానికి అసాంఘిక శక్తులుగా కనిపిస్తున్నారా అంటూ ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి జగన్‌ సర్పంచ్‌లను అసాం ఘిక శక్తులుగా చూపించి, నిధుల విషయాన్ని బయటకు రాకుండా అడ్డుకుం టున్నారని ఆరోపించారు. సర్పంచ్‌ల న్యాయబద్దమైన సమస్యలను పరిష్కరిం చి, గ్రామాలు సుభిక్షంగా ఉండేలా చూడాలని జగన్‌కు సూచించారు.

Updated Date - Feb 07 , 2024 | 12:36 AM