Share News

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:11 AM

న్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ లావణ్యవేణి హెచ్చరించారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
కైకరం వద్ద జాతీయ రహదారిపై జేపీ లావణ్యవేణి సమక్షంలో తనిఖీ

జాతీయ రహదారి, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీ

ఉంగుటూరు, మార్చి 26: ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ లావణ్యవేణి హెచ్చరించారు. కైకరం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ సమక్షంలో అధికారులు, సిబ్బంది వాహనాలను తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనల దృష్ట్యా రూ.50 వేలకు మించి నగదు దూరప్రాంతాలకు పట్టుకు వెళ్లరాదన్నారు. అంతకుమించితే సరైన ఆధారాలు సమర్పించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కె.వెంకట శివయ్య, డీటీ బొడ్డేపల్లి దుర్గా ప్రసాద్‌, ఏఎస్‌ఐ కడియాల సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.

పెదవేగి: ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపఽథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు అనుసరించాలని మత్యశాఖ ఏడీ, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి నరసింహారావు అన్నారు. వంగూరు సమీపంలో జాతీయ రహదారిపై వాహ న తనిఖీ నిర్వహించారు. పరిమితికి మించి నగదు తీసుకెళ్లకూడదన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వస్తువులు, ఇతర సామగ్రి తరలించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలకు లోబడి నడచుకో వాలని, లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. తనిఖీ బృందంలో పెదవేగి ఏఎస్‌ఐ పీఎస్వీ.ప్రవీణ్‌, సిబ్బంది ఉన్నారు.

కామవరపుకోట: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం, ఓటర్లను ప్రలోభపెట్టే వస్తువుల రవాణా జరగకుండా తడికలపూడి పోలీసు లు, రెవెన్యూ అధికారులు కొత్తూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, చిన్నకార్లు, వ్యానులను సమగ్రంగా తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల అధికారి ఎస్‌డి.మొహిద్దీన్‌, జయ బాబు మాట్లాడుతూ పత్రాలు లేకుండా రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకువెళితే సీజ్‌ చేస్తామన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఎటువంటి వస్తువులు తీసుకువెళ్లినా సీజ్‌ క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు.

జీలుగుమిల్లి: చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సురేష్‌కుమార్‌రెడ్డి అన్నారు. కామయ్యపాలెం, రాచన్నగూడెం, జీలుగు మిల్లి రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులను ఆయన పరిశీలించారు. ప్రతీ వాహనా న్ని తనిఖీ చెయ్యాలన్నారు. 24గంటల పాటు విధుల్లో సిబ్బంది అప్రమ త్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర సరిహద్దు నుంచి ఎటువంటి ఎన్నికల ప్రచార సామగ్రి తరలిపోకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:11 AM