Share News

రాజీనామా చేసి తప్పు చేశామా?

ABN , Publish Date - May 19 , 2024 | 12:06 AM

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.5 వేలు వేతనంతో జిల్లాలో 9 వేల 200 మంది వలంటీర్లను నియమించింది. ఐదేళ్లపాటు వీరితో పనులు చేయించుకున్న సర్కార్‌.. ఎన్నికల సమయం రాగానే వారితో రాజీనామాలు చేయించేందుకు అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారు.

 రాజీనామా చేసి తప్పు చేశామా?

మాజీ వలంటీర్ల కుంగుబాటు

కూటమి ప్రభుత్వం వస్తుందని బలంగా ప్రచారం

రాజీనామాలు చేయని వారికి యధావిధిగా వే తనం

వచ్చే ప్రభుత్వంలో పది వేల వేతనంతో జాక్‌పాట్‌

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.5 వేలు వేతనంతో జిల్లాలో 9 వేల 200 మంది వలంటీర్లను నియమించింది. ఐదేళ్లపాటు వీరితో పనులు చేయించుకున్న సర్కార్‌.. ఎన్నికల సమయం రాగానే వారితో రాజీనామాలు చేయించేందుకు అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారు. ఇలా రాజీనామా చేసిన వారినే, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లుగా గుర్తించామని మభ్యపెట్టింది. ప్రభుత్వం నుంచి వేతనం ఇస్తూ.. పార్టీకి సేవలందించాలి అనే తీరులో వీరి వ్యవహారం సాగింది. నియోజకవర్గ నేతల ఒత్తిడి, పెట్టిన ఇబ్బందుల కారణంగా జిల్లాలో నాలుగు వేల 200 మంది బలవంతంగా రాజీనామాలు చేశారు. ఇలా రాజీనామాలు చేసిన వీరికి ప్రభుత్వం వేతనం ఇవ్వలేదు. నేతలు కూడా కొద్దిపాటి సొమ్ముతో సరిపెట్టారు. ఒక్కొక్క వలంటీరుకు ఐదు వేలు చొప్పున ఇచ్చి ప్రచారంలో వారి సేవలను వినియోగించుకున్నారు. రాజీనామా చేయని వలంటీర్లకు మాత్రం ప్రభుత్వం గత నెలతోపాటు, ఈ నెల వేతనం కూడా ఇచ్చింది. పది వేలు లబ్ధి పొందారు. ముందు ముందు ప్రభుత్వం వారి సేవలు కొనసాగించనుంది. తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టోలో వలంటీర్లకు పది వేలు వేతనం ఇస్తామంటూ ప్రకటించింది. దీంతో వీరు పునరాలోచనలో పడ్డారు. ఎంత ఒత్తిడి చేసినా సరే ఐదు వేల మంది వలంటీర్లు రాజీనామాకు ససేమిరా అన్నారు. ప్రభుత్వం మారితే రాజీనామా చేయని వలంటీ ర్లు మాత్రం యధావిధిగా కొనసాగుతారు. వారికి పది వేల గౌరవ వేతనం లభిస్తుంది. మరోవైపు ప్రభుత్వ పోత్సాహకాలు ఉంటాయి.

ఎన్నికల సంఘం ఆదేశాలకు వక్రభాష్యం

వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల షెడ్యూలు అమ లులోకి వచ్చిన తరువాత విధులకు దూరంగా ఉంచాల ని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీనికి వైసీపీ వక్ర భాష్యం చెప్పింది. టీడీపీ, జనసేన, బీజేపీ కుట్ర వల్లే వలంటీర్లను పక్కన పెట్టారని వైసీపీ నేతలు నూరి పోశారు. ఇక తామకు వలంటరీ విధుల్లో ఉంచరంటూ భయపెట్టింది. వైసీపీ నేతలను నమ్మి వలంటీర్లు ఒక్కొ క్కరుగా రాజీనామాలు చేశారు. కూటమిపై తప్పును ఎగదోచి ప్రజల్లో సానుభూతి పొందాలని వైసీపీ కుయు క్తులు పన్నింది. వైసీపీ నేతల వలలో వలంటీర్లు చిక్కు కున్నారు. జిల్లావ్యాప్తంగా 4 వేల 200 మంది రాజీనా మాలు సమర్పించారు. ఎన్నికల ప్రచారాల్లోనూ పాల్గొన్నా రు. బలవంతంగా వారిని వీధుల్లోకి తెచ్చారు. ఎన్నికల వేళ వారి ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. వలంటీ ర్లను జీతాలు తీసుకొనే సేవకులుగానే గుర్తించారు. వలంటీర్ల ప్రభావం ఎన్నికల్లో ప్రయోజనం చేకూరలేదు. ఇలా వైసీపీకి నష్టం వాటిల్లింది. నేతలు మాట విని రాజీ నామాలు చేసిన వలంటీర్లకు దిక్కులు చూస్తున్నారు. ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏమిటంటూ వాపోతున్నారు.

ప్రభుత్వం మారితే కష్టమే

రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోతుందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కూటమిలో జోష్‌ నెలకొంది. కూటమి అభ్యర్థులకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపు తున్నారు. వైసీపీ అభ్యర్థుల శిబిరాలు వెలవెలబోతున్నా యి. అభ్యర్థులను కలిసే నేతలు కరువయ్యారు. అంతా ముఖం చాటేస్తున్నారు. ఎన్నికల రోజున కార్యకర్తలు కూడా పోలింగ్‌ స్టేసన్‌లు వద్ద కానరాలేదు. ప్రచారం నిర్వహించలేదు. అభ్యర్థులు వలంటీర్లపైనే ఆధారపడా ల్సి వచ్చింది. వీరు లేకపోతే ఎన్నికలే లేవంటూ వైసీపీ అభ్యర్థులు వాఖ్యానిస్తున్నారంటే ఆ పార్టీకి కార్యకర్తల లోటు ఎంతగా ఉందో అర్ధమవుతుంది. వైసీపీ కార్యకర్త లను వదిలేసి మమ్మల్ని బలి చేసిదంటూ వలంటీర్లు మదనపడుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకు న్నట్లు కుమిలిపోతున్నారు. రెండు నెలలపాటు వలంటీర్ల సేవలను వినియోగించుకోని ప్రభుత్వం జూన్‌లో మళ్లీ వారిని తెరపైకి తేనుంది. రెండు నెలలపాటు పెన్షన్‌లు ఇవ్వడంలోనూ ప్రభుత్వం దొంగబుద్ధి చూపింది. ఇంటిం టికి పెన్షన్‌ ఇవ్వకుండా వృద్ధులను వేధించింది. జూన్‌లో ఆ బాధ తొలగిపోయే అవకాశం ఉంది. రాజీనామా చేయని వలంటీర్లకు ఇప్పటికే వేతనం ఇస్తోంది. దీంతో జూన్‌ పెన్షన్‌లను అందుబాటులో వున్న వలంటీర్ల ద్వారా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజీనామా చేసిన వలంటీర్లను కుంగదీస్తుంది.

Updated Date - May 19 , 2024 | 12:06 AM