Share News

14,707 ఉజ్వల కనెక్షన్లు

ABN , Publish Date - Jan 06 , 2024 | 12:00 AM

జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు అర్హులం దరికీ ఉజ్వల్‌ గ్యాస్‌ కనెక్షన్లు అందజేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది.

14,707 ఉజ్వల  కనెక్షన్లు

ఏలూరు సిటీ, జనవరి 5 : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు అర్హులం దరికీ ఉజ్వల్‌ గ్యాస్‌ కనెక్షన్లు అందజేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. పేదవారు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారం దరూ ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన పథకానికి అర్హులు. భారత పెట్రో లియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ కట్టెలు, బొగ్గు ఆవుపేడ మొదలైన సంప్రదాయ వంట ఇంధనాలను ఉపయోగించే గ్రామీణ , నిరాశ్రయులైన కుటుంబాలకు ఎల్‌పీజీ వంటి స్వచ్ఛమైన వంట ఇంధ నాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో ప్రధాన మంత్రి ఉజ్వల్‌ యోజన (పీఎంయూవై) ఒక ప్రధాన పథకంగా ప్రవేశ పెట్టారు. ఇప్పటివరకు జిల్లాలోని అర్హులైన 14,707 మంది లబ్ధిదారులకు గ్యాస్‌ కనెక్షన్లతో పాటు గ్యాస్‌ పొయ్యిలు ఉచితంగా అందజేశారు. జిల్లాలో ఇంకా అర్హులెవరైనా ఉంటే ఈ కనెక్షన్లు పొందాలని జిల్లా పౌరసరఫరా ల శాఖాధికారి ఆర్‌ఎస్‌ఎస్‌ సత్యనారాయణ రాజు శుక్రవారం ‘ఆంధ్ర జ్యోతి’కి తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల్‌ పథకం కింద ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌ పొందడం కోసం లబ్ధిదారులు అఽధిక సంఖ్యలో గ్యాస్‌ ఏజెన్సీలకు వెళ్ళుతుండడంతో అక్కడ రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఈ కనెక్షన్‌ పొందేందుకు దరఖాస్తుదారుకు (మహిళ మాత్రమే), తప్పనిసరిగా 18 ఏళ్లు నిండి ఉండాలి. ఒకే ఇంటిలో ఏ ఓఎంసీ నుంచి ఇతర ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ ఉండరాదు.

Updated Date - Jan 06 , 2024 | 12:00 AM