రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:10 AM
బైక్‌ను కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన నూజివీడు మండలం మీర్జాపురంలో జరిగింది.

నూజివీడు టౌన్, జూన్ 11: బైక్‌ను కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన నూజివీడు మండలం మీర్జాపురంలో జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన కొండేటి ఆదిశేషు(63), మైనం అశోక్ (34) ద్విచక్ర వాహనంపై ఏలూరు జిల్లా నూజివీడు మండలం జంగంగూడెం గ్రామంలోని బంధువుల ఇంటి వద్ద అన్నప్రాసనకు హాజరై తిరిగి వెళుతుండగా మీర్జాపురం వద్ద వీరి ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో వీరిద్దరూ తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు నూజివీడు రూర ల్ ఎస్సై మల్లికార్జునరెడ్డి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.