Share News

తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించిన గిరిజనులు

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:00 AM

భూరికార్డుల్లో తహసీల్దార్‌ సంతకాన్ని తొలగించడా న్ని నిరసిస్తూ మంగళవారం అఖిల భారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్‌) ఆధ్వ ర్యంలో గిరిజనులు తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు.

తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించిన గిరిజనులు
తహసీల్దార్‌ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం ఇస్తున్న ఏఐకేఎంఎస్‌ నాయకులు

భూరికార్డుల్లో డిజిటల్‌ సంతకం తొలగింపుపై నిరసన

బుట్టాయగూడెం, మార్చి 5: భూరికార్డుల్లో తహసీల్దార్‌ సంతకాన్ని తొలగించడా న్ని నిరసిస్తూ మంగళవారం అఖిల భారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్‌) ఆధ్వ ర్యంలో గిరిజనులు తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. వెలుతురు వారిగూడెంకు చెందిన గిరిజనుల భూమి అసైన్డ్‌ రికార్డుల నుంచి తహసీల్దార్‌ సంతకాలు తొలగించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని, రికార్డుల్లో డిజిటల్‌ సంతకం పునరుద్ధరించాలని ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్ముల సురేష్‌ డిమాండ్‌ చేశారు. 2007లో 1/70 భూమిని తీసుకుని అసైన్మెంట్‌ చేసి 74 మంది గిరిజన అబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారన్నారు. భూములను అసైన్డ్‌ రికార్డుల్లో చేర్చి బ్యాంకుల్లో రుణాలు పొందినట్లు తెలిపారు. వారం రోజుల నుంచి అసైన్డ్‌ రికా ర్డుల్లో తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకం కనిపించలేదని, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గిరిజనులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్‌ సంతకాన్ని వెంటనే ఇవ్వకపోతే ఇక్కడి నుంచి వెళ్లేదిలేదని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గిరిజనులు బైఠాయించారు. విషయం తెలుసుకున్న తహసీలార్‌ వెంకటేశ్వర్లు కార్యాలయానికి చేరుకుని రెండు రోజుల్లో డిజిటల్‌ సంతకాన్ని ఇస్తాన ని హామీ ఇవ్వడంతో గిరిజనులు ఆందోళన విరమించారు. అనంతరం నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. వెట్టి సుబ్బన్న, ఎస్‌.రామ్మోహన్‌, జి.పో తురెడ్డి, టి.బాబురావు, వెట్టి భారతి, ఎంపీటీసీ కొవ్వాసు గోవిందరాజు, ఈ.భూష ణం, బి.వినోద్‌, బాషా రంపాలరాజు, డి.అర్జునుడు, న్యాయవాది బాషా శ్యాంబాబు, నాగమ్మ, చిలకమ్మ, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.

వేతన బకాయిల చెల్లించాలని ఆయాలు, స్వీపర్ల ధర్నా

ఏలూరు ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఆయాలు, స్వీపర్లు వేతన బకాయిల కోసం ఆందోళన చేపట్టారు. పెండింగ్‌లో వున్న వేతన బకాయిలు చెల్లించా లని, వేతనాలను పెంచాలని డి మాండ్‌ చేస్తూ పాఠశాలల ఆయా లు, స్వీపర్ల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం డీఈవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సంఘ జిల్లా కార్యదర్శి కె.బుచ్చిబాబు, మద్దాల దుర్గ, డేగల భవాని మాట్లాడుతూ 9 ఏళ్లుగా పాఠశాలల ఆవరణ, టాయిలెట్లను శుభ్రం చేస్తున్నామని, ఇప్పటికీ నెలకు కేవలం రూ.6వేలు వేతనం మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వందల సంఖ్య లో విద్యార్థులున్న పాఠశాలల్లో ఆయాలపై భారం పడుతోందని, అనారోగ్యంవస్తే సెలవులు వర్తింపజేయడం లేదన్నారు. ప్రతీ వంద మంది విద్యార్దులకు ఒక ఆయా వంతున నియమించాలని, నెలలో ఒకరోజైనా మెడికల్‌ లీవ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 2015 నుంచి పనిచేస్తున్నవారిని విధుల్లో కొనసాగించాలని కోరారు. డీఈవో అబ్రహంకు వినతిపత్రాన్ని అందజేశారు. సంఘ నాయకులు చంద్ర, నాగలక్ష్మి, జి.కుమారి, వెంకాయమ్మ, రాద తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:00 AM