Share News

తాబేళ్లు స్వాధీనం

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:38 AM

అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న 40 బ్యాగుల తాబేళ్లను కొల్లేరులో వదిలినట్టు అటవీశాఖ డిప్యూటీ రేంజర్‌ జయప్రకాశ్‌ తెలిపారు.

తాబేళ్లు స్వాధీనం
స్వాధీనం చేసుకున్న తాబేళ్లను కొల్లేరులోకి వదులుతున్న అటవీశాఖ సిబ్బంది

కొల్లేరులో వదిలిన అటవీశాఖ సిబ్బంది

కైకలూరు, జనవరి 10: అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న 40 బ్యాగుల తాబేళ్లను కొల్లేరులో వదిలినట్టు అటవీశాఖ డిప్యూటీ రేంజర్‌ జయప్రకాశ్‌ తెలిపారు. రేంజర్‌ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి కలిదిండి మండలం సానారుద్రవరం వద్ద ఖాలీ ప్రదేశంలో 40 మూటల్లో తాబేళ్లు ఉన్నాయి. రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు ఏదో అలికిడి విన్పించి ఆ ప్రాంతం వైపు వెళ్లగా కొంతమంది పోలీసులను చూసి పారిపోయారు. ఆ మూటలను పరిశీలిస్తే వాటిలో తాబేళ్లు ఉన్నట్టు పోలీ సులు గుర్తించారు. ఈ స్వాధీనం చేసుకున్న తాబేళ్లను కైక లూరు అటవీశాఖ అధికారులకు అప్పగించగా వారు వాటి ని పక్షుల కేంద్రం సమీపాన కొల్లేరు సరస్సులో మంగళ వారం రాత్రే వదిలినట్టు తెలిపారు.

Updated Date - Jan 11 , 2024 | 12:38 AM