Share News

పొగాకు ధరల పరుగు

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:01 AM

వర్జీనియా పొగాకు ధరలు గురువారం మార్కెట్‌తో పుంజుకున్నాయి.

పొగాకు ధరల పరుగు

బుట్టాయగూడెం, ఏప్రిల్‌ 18 : వర్జీనియా పొగాకు ధరలు గురువారం మార్కెట్‌తో పుంజుకున్నాయి. మార్చి 6వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోలు ప్రారంభం కాగా ప్రారంభ ధర గరిష్ఠంగా రూ.240లు నమోదైంది. కాగా అప్పటి నుంచి మందకొడిగా అమ్మకాలు జరుగుతున్నా లోగ్రేడ్‌ పొగాకుకు మంచి ధరలు పలికాయి. లోగేడ్ర్‌ కిలో రూ.225 నుంచి రూ.235 వరకు ధర పలికింది. ఈ క్రమం లో రైతాంగం అంతా లోగ్రేడ్‌ పొగాకును అధికంగా అమ్మ కానికి తీసుకొచ్చారు. కాగా ఎ–గ్రేడ్‌ ధరలు గురు వారం కిలో రూ.250 మార్క్‌ను క్రాస్‌ చేసింది. దేవరపల్లి లో గరిష్ఠ ధర రూ.255, జంగారెడ్డిగూడెం–1లో రూ.257, జంగా రెడ్డిగూడెం–2లో రూ.251, కొయ్యలగూడెంలో రూ.255, గోపాలపురంలో రూ.254 ధర పలికింది.

Updated Date - Apr 19 , 2024 | 01:01 AM