Share News

విధుల వేళల్లో మార్పు

ABN , Publish Date - Apr 13 , 2024 | 01:50 AM

కాల్వలకు విడుదలైన నీటిని చేపలు, రొయ్యల చెరువులకు మళ్లించకుండా నిఘా నిర్వహించేందుకు నియమించిన టీముల్లోని గ్రామ సచివాలయాల మహిళా ఉద్యోగుల విధుల నిర్వహణ సమయాల్లో మార్పులు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

విధుల వేళల్లో మార్పు

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

ముదినేపల్లి, ఏప్రిల్‌ 12 : కాల్వలకు విడుదలైన నీటిని చేపలు, రొయ్యల చెరువులకు మళ్లించకుండా నిఘా నిర్వహించేందుకు నియమించిన టీముల్లోని గ్రామ సచివాలయాల మహిళా ఉద్యోగుల విధుల నిర్వహణ సమయాల్లో మార్పులు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ‘‘కాల్వ గట్లపై మహిళా ఉద్యోగుల పాట్లు’’ శీర్షికన శుక్రవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన ముది నేపల్లి ఎంపీడీవో మురళీ గంగాధరరావు నీటి చౌర్యం జరగకుండా నియమించిన టీముల్లోని మహిళా ఉద్యోగుల డ్యూటీ సమయా లను సర్దుబాటు చేయాలని ఆయా పంచాయతీల కార్యదర్శులను ఆదేశించా రు. మహిళా ఉద్యోగులను ఉదయం 6 నుంచి 2 గంటల వరకు డ్యూటీ సమ యా లను కేటాయించే విధంగా సర్దుబాటు చేస్తామని ఎంపీడీవో తెలిపారు.

Updated Date - Apr 13 , 2024 | 01:50 AM