Share News

రిజర్వు ఫారెస్టులోకి పులి తిరుగుముఖం

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:15 AM

రెండు నెలలుగా ప్రజానీకాన్ని భయాందోళనలకు గురి చేసి, అటవీశాఖ అధికారులను ముప్పు తిప్పలు పెట్టిన పులి శనివారం రిజర్వు ఫారెస్టులోకి వెళ్ళినట్లు అటవీక్షేత్రాధికారి దావీదురాజు తెలిపారు.

రిజర్వు ఫారెస్టులోకి పులి తిరుగుముఖం
రెడ్డినాగంపాలెం సమీపంలో పులి పాదముద్రలు

పోలవరం, ఫిబ్రవరి 24 : రెండు నెలలుగా ప్రజానీకాన్ని భయాందోళనలకు గురి చేసి, అటవీశాఖ అధికారులను ముప్పు తిప్పలు పెట్టిన పులి శనివారం రిజర్వు ఫారెస్టులోకి వెళ్ళినట్లు అటవీక్షేత్రాధికారి దావీదురాజు తెలిపారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరకపాడు అడవిలో రెండు మేకలను బలితీసుకున్న పులి అక్కడి నుంచి బుట్టాయిగూడెం మండలం లక్ష్మీపురం కొవ్వాడ గ్రామాల పరిఽధిలో సంచరించి పోలవరం మండలం రెడ్డినాగంపాలెం చేరుకుందని అక్కడి నుంచి రిజర్వు ఫారెస్టులోకి వెళ్ళి పోయిం దని, పులి పాదముద్రలు పరిశీలించామని అటవీశాఖ అధికారులు తెలిపారు. రామనరసాపురం, సరిపల్లికుంట, జిల్లేల్ల గూడెం పంచాయతీల ప్రజలు పాడి పశువుల రైతులు అడవుల్లోకి వెళ్ళరాదని, పశువులను మేపడానికి అడవుల్లోకి వెళ్ళరాదని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మైదాన ప్రాంతాల్లో పాడిపశువుల సంచార ప్రాంతాలు అలవాటు పడిన పులి మళ్ళీ రాకుండా అటవీశాఖ అఽధికారులు చర్యలు తీసుకోవాలని కోరు తున్నారు. పులి దాడిలో చనిపోయిన పాడి పశువుల రైతులకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అఽధికారులు తెలిపారు.

Updated Date - Feb 25 , 2024 | 12:15 AM