Share News

పోలవరం ఏజన్సీలో పులి సంచారం

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:15 AM

పోల వరం ఏజన్సీలో పులి సంచరి స్తోందన్న సమాచారంతో ఏజన్సీ గ్రామాల ప్రజలు భయంతో బెంబేలెత్తు తున్నారు.

పోలవరం ఏజన్సీలో పులి సంచారం
గుర్తించిన పులి పాదముద్రలు

బెంబేలెత్తుతున్న గిరిజన గ్రామాల ప్రజలు

పోలవరం, ఫిబ్రవరి 19 : పోల వరం ఏజన్సీలో పులి సంచరి స్తోందన్న సమాచారంతో ఏజన్సీ గ్రామాల ప్రజలు భయంతో బెంబేలెత్తు తున్నారు. సోమవారం పోలవరం మండలం ప్రగడపల్లి పంచాయతీ గార్యగొయ్యి గ్రామ సమీపంలో పంటపొలాల్లో పులి పాదముద్రలు గుర్తించిన రైతులు అటవీశాఖ అధికారులకు సమా చారం ఇచ్చారు. ఆ ప్రాంతానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాదముద్రలు పులివేనని గుర్తించి నిర్దారించారు. ఆ ప్రాంతంలో పులి సంచరించిన ప్రాంతాలను పులి సంచారం గమనం తదితర అంశాలపై దృష్టి సారించి నిఘా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గత రెండు నెలల క్రితం పాపికొండల నేషనల్‌ పార్కు నుంచి ద్వారకాతిరుమల, గోపాలపురం, బుట్టాయిగూడెం మండలాల పరిధిలో సంచరించి పాడి పశువులపై దాడి చేసి చంపుకుతిన్న పులి చివరిసారిగా కన్నాపురం అడవీ రేంజ్‌ పరిధిలో ఆవూదూడపై దాడి చేసి చంపుకు తింది. ద్వారకాతిరుమల, కొవ్వాడ ఉడతపల్లి, కరకపాడు గ్రామాల్లో గడిచిన రెండు నెలల్లో పాడి పశువులపై, మేకలపై, ఒక అడవి పందిపై దాడి చేసింది. పాపికొండల నేషనల్‌ పార్కులో తగిన ఆహారం దొరకకపోవడం వలన అడవులు దాటి జనా వాస ప్రాంతాల్లోకి ప్రవేశించి పాడిపశువులపై దాడులకు పాల్పడుతోందని, అటవీశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అటవీ క్షేత్రాధికారి దావీదురాజు మాట్లాడుతూ పులి సంచరించిన పంటపొలాలు అటవీ ప్రాంతానికి చేరువగా ఉండడం వలన వచ్చి ఉంటుందని మళ్ళీ పాపికొండల అడవుల్లోకి వెళ్ళిపోయే అవకాశాలున్నాయని అంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Updated Date - Feb 20 , 2024 | 12:16 AM