Share News

టిడ్కో ఇళ్లకు మోక్షం

ABN , Publish Date - Jun 09 , 2024 | 12:04 AM

రాష్ట్రంలో తెలుగుదేశం – జనసేన – బీజేపీ కూటమి విజయం సాధించడంతో టిడ్కో ఇళ్లకు మోక్షం లభించనుంది. లబ్ధిదారుల్లో ఆశలు చిగురించ గా, దీనికి అనుగుణంగా ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాదించిన ప్రజా ప్రతినిధులు ఈ ఇళ్ల నిర్మాణంపై సమీ క్షలు ప్రారంభించారు.

టిడ్కో ఇళ్లకు మోక్షం

కూటమి విజయంతో లబ్ధిదారుల్లో ఆశలు

శ్రావణమాసంలో పాలకొల్లులో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ

తాడేపల్లిగూడెం, భీమవరంలలో సమీక్షలు

రాష్ట్రంలో తెలుగుదేశం – జనసేన – బీజేపీ కూటమి విజయం సాధించడంతో టిడ్కో ఇళ్లకు మోక్షం లభించనుంది. లబ్ధిదారుల్లో ఆశలు చిగురించ గా, దీనికి అనుగుణంగా ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాదించిన ప్రజా ప్రతినిధులు ఈ ఇళ్ల నిర్మాణంపై సమీ క్షలు ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంలో పూర్తిచేసిన ఇళ్లను లబ్ధిదారులకు అందించేం దుకు మూడేళ్లు నాన్చి, ఆనక పార్టీ రంగులు వేసి, మౌలిక సదుపాయాలు కల్పించకుండానే అందించారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

తాడేపల్లిగూడెం రూరల్‌, జూన్‌ 8:కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీని వాస్‌ ఈ ఇళ్ల పరిస్థితిపై ఆరా తీసి లబ్ధిదారులకు త్వరితగ తిన అందించాలని ఆదేశాలిచారు. సీఎంగా చంద్రబాబు పాల కొల్లులో లబ్ధిదారులకు శ్రావణమాసంలో ఇళ్లను అందిస్తామని తెలిపారు. భీమవరంలో ఎమ్మెల్యే అంజిబాబు ఈ ఇళ్ల నిర్మా ణాలపై సమీక్ష జరిపారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరక ముందే టిడ్కో ఇళ్లపై సమీక్షలు నిర్వహించి త్వరలోనే అప్ప గించేందుకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తమకు మంచి రోజులు వచ్చాయని లబ్ధిదారులు ఆనందిస్తున్నారు.

రంగులకే కోట్లు

వైసీపీ ప్రభుత్వంలో కక్ష సాధింపులో భాగంగా.. చంద్ర బాబు హయాంలో నిర్మించిన ఇళ్లను ఇచ్చేందుకు మొగ్గు చూపలేదు. సరికదా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేలా పూర్తయిన ఇళ్లను సైతం గాలికి వదిలేశారు. దీంతో ఆ టిడ్కో ఇళ్లు పాములకు నిలయాలుగా మారాయి. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో వీటిని క్వారంటైన్‌లుగా మార్చి రోగులను ఇక్కడ ఉంచారు. వైసీపీ ప్రభుత్వం తన రంగుల పిచ్చితో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.

లబ్ధిదారులకు ఇవ్వలేదు

భీమవరంలో సింగిల్‌ బెడ్‌ రూం, డబుల్‌ బెడ్‌ రూంలు కలిపి 8,352 ఇళ్ల నిర్మాణం చేపట్టగా, పాలకొల్లులో 6,144, తాడేపల్లిగూడెంలో 5,376 ఇల్లు పూర్తయ్యాయి. వైసీపీ ప్రభు త్వం కొలువు తీరే నాటికి సగానికిపైగా ఇళ్లకు పైపు లైన్‌లు, విద్యుత్‌ అందించగా వాటిని లబ్ధిదారులకు అందించడంలో తాత్సారం చేశారు. దీంతో కొండంత ఆశలతో ఉన్న లబ్ధిదారు లకు నిరాశే మిగిలింది. కట్టిన ఇళ్లు కళ్ల ముందే ఉన్నా, వాటిని తమ సొంతం చేసుకోలేక, అద్దె ఇళ్లల్లో మగ్గ లేక తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. పాలకొల్లు, తాడేపల్లిగూడెం, భీమవరం పట్ట ణాల్లో మొత్తం 19,872 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయగా మూడు న్నరేళ్ల తర్వాత వైసీపీ ప్రభుత్వం తొలి విడతగా ఆరు వేల ఇళ్లు, రెండో విడతగా జనవరిలో మూడు వేల ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందించారు. తొలి విడతలో పట్టాలు పొందిన వారు అరకొర సదుపాయాలతో కాపురాలకు వచ్చి పాములు, తుప్పల మధ్య నివాసం ఉన్నారు. మంచినీరు, విద్యుత్‌ సరఫ రా తదితర సమస్యలను ఎదుర్కొంటున్నారు. మూడున్నరేళ్లు పూర్తయిన ఇళ్లను గాలికి వదిలేయడం వల్ల పైన శ్లాబులపై నీళ్లు నిలిచి పెచ్చులు ఊడి లీకయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎన్ని కలు వస్తున్నాయన్న సమయంలో హడావుడిగా లీకైన శ్లాబు లను మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారు.

ఈఎంఐల ఒత్తిడి

ఎన్నికల సమయంలో టిడ్కో లబ్ధిదారులు ఎవరికి పైసా కట్టాల్సిన పనిలేదంటూ హామీ ఇచ్చిన జగన్‌ సీఎం అయ్యాక ఆ ఊసే ఎత్తలేదు. అప్పటికే అగ్రిమెంట్‌లు పూర్తి చేసుకున్న ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి ఈఎంఐల ఒత్తిడి ఎక్కువైంది. తాము ఇటు ఇల్లు సొంతం చేసుకోలేదన్న బాధ ఓ వైపు, అద్దెలు చెల్లించలేక మరోవైపు నలిగిపోతున్న లబ్ధిదా రులకు గోరుచుట్టుపై రోకటిపోటులా ఈఎంఐలు చెల్లించాలనే ఒత్తిడి పెరగడంతో లబ్ధిదారులు అధికారుల వద్దకు పరుగులు తీశారు. వారు ఏం చెప్పాలో తెలియక చేతులెత్తేయడంతో ఏం చేయాలో తెలియక గందరగోళంలో ఉండేవారు.

Updated Date - Jun 09 , 2024 | 12:04 AM