Share News

సరదాగా వెళ్లి మృత్యుఒడికి..

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:20 AM

జల్లేరు వాగులోకి చేపల వేట చూసేందుకు సరదాగా వెళ్లిన ముగ్గురు మృత్యువాత పడ్డారు.

సరదాగా వెళ్లి మృత్యుఒడికి..
మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

ముగ్గురిని మింగేసిన జల్లేరు వాగు

రెండు కుటుంబాల్లో తీరని విషాదం

ఏలూరు క్రైం/బుట్టాయగూడెం, ఏప్రిల్‌ 26: జల్లేరు వాగులోకి చేపల వేట చూసేందుకు సరదాగా వెళ్లిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఈ ఘటన జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలోని జల్లేరు బ్రిడ్జి వద్ద జరి గింది. సాధారణంగా ఇక్కడ వలలు వేసి చేపలు పట్టు కుంటూ ఉంటారు. జీలుగుమిల్లి మండలం దిబ్బగూడానికి చెందిన మౌలాలి అక్కడ చేపలు పట్టడానికి శుక్రవారం బయలుదేరగా అతని భార్య షేక్‌ మొహిషా(23) తాము వస్తామని, ఆమె సోదరుడు అషాద్‌(14), బంధువులైన అశ్వారావుపేట మండలం ఊట్లపల్లికి చెందిన షేక్‌ ఖాజా హుస్సేన్‌, అతని కుమార్తె రేష్మా(24)లను తీసుకుని బయలుదేరారు. వీరంతా శుక్రవారం మధ్యాహ్నం నుంచి జల్లేరు వాగు వద్దే ఉన్నారు. మౌలాలి, ఖాజా హుస్సేన్‌ చేపలు పట్టడానికి దూరంగా వెళ్లగా మోషద్‌, రేష్మా, అషాద్‌ వాగులోకి దిగారు. ప్రమాదవశాత్తు గుండంలో పడిపోయారు. ఇది చూసిన వారు కేకలు వేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దూరాన వున్న మౌలాలి హుస్సేన్‌లకు చెప్పడంతో వారు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకు న్న జంగారెడ్డిగూడెం ఎస్‌ఐ జ్యోతిబస్‌ ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో మృతదేహాలను సాయం త్రానికి బయటకు తీశారు. కేసు నమోదు చేసి మృతదేహా లను జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

విగత జీవులుగా మారిన భార్యను, బావమరిది మృతదే హాలను చూసిన మౌలాలి తల్లడిల్లిపోయాడు. ఖాజా హుస్సేన్‌ కుమార్తె మృతదేహం పట్టుకుని ‘నాన్న నేను వస్తానంటూ వచ్చి.. నన్ను విడిచి వెళ్లిపోయావా’.. అంటూ కన్నీటి పర్యతమ య్యాడు. 2022లో ఆర్టీసీ బస్సు ఇదే వాగు బ్రిడ్జిపై నుంచి నీటిలో పడి పది మంది ప్రయాణికులు మరణించారు. ఆ ప్రాంత ప్రజలు ఆ ఘటన మరువక ముందే మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు.

Updated Date - Apr 27 , 2024 | 12:20 AM