Share News

ఉచిత ఇసుక అందించడమే లక్ష్యం

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:24 AM

ఉచిత ఇసుక పాలసీకి ప్రభుత్వం కట్టుబడి ఉం దని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వల సపల్లి, యల్లాపురంల్లో గురువారం ఉచిత ఇసుక రీచ్‌లను ఆయన ప్రారంభించారు. ఇప్పుడున్న రీచ్‌లతోపాటు మరో 108 రీచ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. దూరాన్ని బట్టి ధర వసూలు చేయాలని, ఇస్టారాజ్యంగా వసూలు చేసేందుకు విలులేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ట్రాక్టర్ల యాజమాను సమావేశమై ధరల వివరాలను ఆర్డీవోకు అందజేయాలన్నారు.

ఉచిత ఇసుక అందించడమే లక్ష్యం
ఇసుక రీచ్‌ను ప్రారంభిస్తున్న మంత్రి పార్థసారథి

మంత్రి కొలుసు పార్థసారథి

ముసునూరు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉచిత ఇసుక పాలసీకి ప్రభుత్వం కట్టుబడి ఉం దని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వల సపల్లి, యల్లాపురంల్లో గురువారం ఉచిత ఇసుక రీచ్‌లను ఆయన ప్రారంభించారు. ఇప్పుడున్న రీచ్‌లతోపాటు మరో 108 రీచ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. దూరాన్ని బట్టి ధర వసూలు చేయాలని, ఇస్టారాజ్యంగా వసూలు చేసేందుకు విలులేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ట్రాక్టర్ల యాజమాను సమావేశమై ధరల వివరాలను ఆర్డీవోకు అందజేయాలన్నారు. నూజివీడు ఆర్డీవో వాణి, సర్పంచ్‌లు చలసాని దామోదరరావు, మొక్కపాటి మురళీ కృష్ణ, ఎంపీ డీవో జి.రాణి, ఇన్‌చార్జి తహసీల్దార్‌ పురు షోత్త మశర్మ, టీడీపీ మండల అధ్యక్షులు దేవినేని ఢలరాం, గ్రామ అధ్యక్షులు మేదరమెట్ల సురేం ద్ర, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పశుగణనకు సహకరించండి

దేశ వ్యాప్తంగా 21వ పశుగణన అక్టోబర్‌ 25 నుంచి 2025, ఫిబ్రవరి 28 వరకు జరుగు తుందని, మంత్రి కొలుసు పార్థసారథి తెలిపా రు. పశుగణనకు సంబంధించిన వాల్‌పోస్టర్లు, బ్రోచర్లు, స్టిక్కర్లు, సూచన పుస్తకాలను మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. 16 రకా ల పెంపుడు జంతువులపై పశుగణన పూర్తి అయితే ఇంటి ముందు తలుపునకు కుడి ఎగువ మూలలో స్టిక్కర్‌ అంటిస్తారన్నారు సన్న, చిన్న కారు రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆర్థిక రుణాలను అందిపుచ్చుకోని సబ్సిడీ రుణా లపై అవగాహన ఉండాలన్నారు. బ్యాంకర్స్‌, అగ్రికల్చర్‌, ఇతర ప్రభుత్వ అధికారులు ప్రతినెల ఒక సమావేశం ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 12:24 AM