Share News

టీచర్ల పోరాటం

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:39 PM

సమస్యల పరిష్కారం కోరుతూ టీచర్లు పోరు బాట పట్టారు.

టీచర్ల పోరాటం
ఏలూరు తహసీల్దార్‌ కార్యాలయం ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా

తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఏపీటీఎఫ్‌ ధర్నా

ఏలూరు రూరల్‌, ఫిబ్రవరి 29: సమస్యల పరిష్కారం కోరుతూ టీచర్లు పోరు బాట పట్టారు. ఏపీటీఎఫ్‌ పిలుపులో భాగంగా తహసీల్దార్‌ కార్యాల యం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఏపీటీఎఫ్‌ రాష్ట్రకార్యదర్శి బీఏ సాల్మన్‌రాజు, జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరి రామారావు, కార్యదర్శి డీకేఎస్‌ఎస్‌ ప్రకాశరావు తదితరులు మాట్లాడారు. 2023 జూలై నుంచి అమలు కావాల్సిన 12వ పిఆర్సీని వెంటనే ప్రకటించాలని విద్యా వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా ఉన్న 117 జీవోను రద్దుచేయాలని డిమాండ్‌ చేశా రు. ఉపాధ్యాయ నియామకాల్లో ప్రవేశపెట్టిన అప్రంటీస్‌ విధానాన్ని రద్దు చేయాలని, ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్‌, ఏపీ జి.ఎల్‌.ఐ రుణాలు మంజూ రు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కె.ఆనంద్‌కుమార్‌, ఏ.దాసరి శ్రీనివాస్‌, రామశేషు, కార్యదర్శి శ్రీనివాస్‌, కృష్ణారావు, కొండయ్య, రమాదేవి, సుహాసిని, సుజాత, రత్నకు మార్‌, రామారావు తదితరులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం: ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బి.రెడ్డిదొర డిమాండ్‌ చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయ సమస్యల పై ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులంతా ఉద్యమాల్లో పాల్గొని సంఘాలకు సహకరించాలన్నారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ పాత విధానంలో అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ కొనసాగించాలని, పెండింగ్‌ డీఏ లను వెంటనే విడుదల చేయాలని, నూతన డీఏలను ప్రకటించాలన్నారు. అనం తరం తహసీల్దార్‌ స్లీవజోజికి వినతిపత్రం అందజేశారు. జిల్లా కార్యదర్శి యువీఎన్‌ రాజు, పీవీఆర్‌ రాజ్యలక్ష్మి, కె.త్రివేణి, ఏపీటీఎఫ్‌ జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండల అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై చర్చలు

ఏలూరు ఎడ్యుకేషన్‌: ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలపై అన్ని ఉపాధ్యా య సంఘాల నాయకులు పాఠశాల విద్య అదనపు డైరెక్టర్‌ పి.పార్వతితో రాష్ట్ర కార్యాలయంలో చర్చించారు. వివరాలను పీఆర్టీయూ జిల్లా అద్యక్షుడు ఆంజనేయులు గురువారం తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు 57 ప్రకారం రాష్ట్రంలో డీఎస్సీ–2003 టీచర్లకు పాతపెన్షన్‌ విధానాన్ని వెంటనే అమలుచేయాలని కోరామన్నారు. సరెండర్‌ లీవు బిల్లులు, ప్రావిడెంట్‌ ఫండ్‌, ఏపీజీఎల్‌ఐకి సంబందించిన బిల్లులు ఇంతవరకు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని, తక్షణమే నిధులు జమ చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎస్సీ–2024కి అప్రంటీస్‌ విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. పాఠశా లల విలీనానికి సంబంధించిన టీచర్ల హేతుబద్ధీకరణ ఉత్తర్వులు 117 జీవో రద్దుచేసి, గతంలో వున్న జీవో 53ప్రకారం ఉపాధ్యాయ పోస్టులను కేటా యించాలని అభ్యర్థించామన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 11:39 PM