చంద్రన్నపై అభిమానం..కాఫీ ఫ్రీ..!
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:03 AM
చంద్రబాబు నాయుడు 4వ సారి ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జంగారెడ్డిగూడెంకు చెందిన ఆయన వీరాభిమాని కనక నాగ శివాని టీ స్టాల్ యజమాని ఎం.రాజు బుధవారం ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు కస్టమర్లకు ఉచితంగా టీ్క్షకాఫీని అందిస్తున్నట్టు తెలిపారు.

బుట్టాయగూడెం : చంద్రబాబు నాయుడు 4వ సారి ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జంగారెడ్డిగూడెంకు చెందిన ఆయన వీరాభిమాని కనక నాగ శివాని టీ స్టాల్ యజమాని ఎం.రాజు బుధవారం ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు కస్టమర్లకు ఉచితంగా టీ్క్షకాఫీని అందిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు కాలేజి రోడ్‌లోని షాపు వద్ద మంగళవారం ఫ్లెక్సీని ఏర్పాటు చేసి చంద్రబాబుపైన ఉన్న తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.