Share News

కూటమి విజయం తధ్యం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:46 AM

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి రానున్న ఎన్నికల్లో విజయం తధ్యమని ఏలూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి అన్నారు.

కూటమి విజయం తధ్యం
ఏలూరులో మాట్లాడుతున్న బడేటి చంటి..

ఏలూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి

ఏలూరుటూటౌన్‌, ఏప్రిల్‌ 17: టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి రానున్న ఎన్నికల్లో విజయం తధ్యమని ఏలూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి అన్నారు. ఏలూరు పవర్‌పేట టీడీపీ కార్యాలయంలో మెగా అభిమా నులతో బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడటానికి ప్రఽధాన కార ణం పవన్‌కల్యాణ్‌ అని అన్నారు. మోగా అభిమానులంతా కూటమి అభ్య ర్థులకు సంపూర్ణమద్దతు తెలపాలని కోరారు. జనసేన ఇన్‌చార్జి రెడ్డి అప్ప లనాయుడు మాట్లాడుతూ గతాన్ని పక్కనపెట్టి మెగా అభిమానులంతా చంటి విజయానికి కృషి చేయాలన్నారు. టీడీపీ నాయకులు మధ్యాహ్నపు బలరామ్‌, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. శ్రీరామనవమి పర్వది నాన్ని పురస్కరించుకుని మరడాని రంగారావు కాలనీలో ఉన్న సీతారామాం జనేయస్వామి దేవాలయంలో బడేటి చంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మూడు పార్టీల కలయిక విజయానికి స్ఫూర్తి : పత్సమట్ల

గణపవరం/భీమడోలు, ఏప్రిల్‌ 17: అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలంటే కూటమి వల్లే సాధ్యమని ఉంగుటూరు జనసేన ఉమ్మడి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు అన్నారు. బుధవారం గణపవరం మండలం పిప్పర, భీమడోలు మండలం కురెళ్లగూ డెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆశయం మేరకు రాష్ట్రం నుంచి వైసీపీని తరిమి కొట్టాల న్నారు. గణపవరంలో టీడీపీ నాయకులు గన్ని నాగగోపాలరావు, ఇందుకూరి రామకృష్ణంరాజు, అద్దేపల్లి వాసు రాజు, కూసంపూడి సురేంద్రకుమార రాజు, యాళ్ళ సుబ్బారావు, కొప్పిశెట్టి ఏసుబాబు, జనసేన నాయకులు తోట శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఎన్టీయే కూటమి గెలుపుతోనే రాష్ట్రప్రగతి : రాంబాబు

పెదవేగి, ఏప్రిల్‌ 17 : ఎన్డీయే కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్ర ప్రగతి ఆధారపడి ఉందని టీడీపీ నాయకుడు పెదర్ల రాంబాబు అన్నారు. విజయరాయిలో టీడీపీ నాయకులు ఇంటింటికి తిరిగి సూపర్‌సిక్స్‌ పథకాల ను ప్రజలకు వివరించి, ఓట్లను అభ్యర్థించారు. రాంబాబు మాట్లాడుతూ జగన్‌రెడ్డి పాలన అంతా అబద్దాలమయమన్నారు. దోచుకోవడం, దాచుకో వడం తప్ప ఐదేళ్ళలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పార్టీ నాయకులు రావిపాటి పిచ్చియ్యచౌదరి. దారిబోయిన సత్యనారాయణ, బిర్లంగి పెద్దులు, పెదర్ల నాని, మంత్రి శ్రీను, వీరంకి నాగరాజు, మాసాబత్తుల నాగరాజు, దుక్కిపాటి విజయకుమార్‌, షేక్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

బ్రాహ్మణులను అణచివేసిన జగన్‌ : ఎంబీఎస్‌ శర్మ

ఏలూరుటూటౌన్‌ : ఐదేళ్ల జగన్‌ పాలనలో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అన్నివిధాల అణచివేశారని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి జిల్లా కన్వీనర్‌ ఎంబీఎస్‌ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వచ్చే సమయానికి జగన్‌కు బ్రాహ్మణులు గుర్తొస్తారా అని ప్రశ్నిం చారు. జగన్‌ పాలనలో దేవాలయాలపై, పూజారులపై, అర్చకులపై దాడులు జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు హయాం లోనే బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి పదకొండు పథకాలు అమలు చేశారన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:46 AM