Share News

కూటమి విజయం ఖాయం

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:16 AM

రాష్ట్రంలో ఎన్టీఏ కూటమి విజయం ఖాయమని, రాష్ట్ర పునఃనిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఏలూరు ఆసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు.

కూటమి విజయం ఖాయం
టీడీపీలో చేరిన నాయకులతో చింతమనేని ప్రభాకర్‌

ఏలూరు కూటమి అభ్యర్థి బడేటి చంటి

ఏలూరుటూటౌన్‌, ఏప్రిల్‌ 21: రాష్ట్రంలో ఎన్టీఏ కూటమి విజయం ఖాయమని, రాష్ట్ర పునఃనిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఏలూరు ఆసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు. ఆదివారం ఏలూరు 27వ డివిజన్‌లోని బాబూజగ్జీవన్‌ రామ్‌ కాలనీలో ప్రజాగళం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ నిరంకుశ పాలనతో ప్రజలంత విసిగిపో యారని అన్నారు. ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమితోనే అభివృద్ధి సాధ్యమన్నారు. వైసీపీ పాలనలో నష్టపోయిన వారందరికి కూటమి ప్రభుత్వం రాగానే సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో యడ్లపల్లి శివ, బెజ్జం అచ్చాయమ్మ, తోటకూర చిట్టిబాబు, ఈ.నాగరాజు, కుమారరాజు, కొండపల్లి రాజు, టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

కూటమికే ఎమ్మార్పీఎస్‌ మద్దతు

చింతలపూడి, ఏప్రిల్‌ 21:కూటమి అభ్యర్థులకే ఎమ్మార్పీఎస్‌ పూర్తి మద్దతు అని రాష్ట్రనాయకులు రాజేశ్వర్‌, విస్సంపల్లి సిద్ధూ ప్రకటించారు. ఆదివారం చింతలపూడిలో ఎమ్మార్పీఎస్‌ నియోజకవర్గ నాలుగు మండలాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జరగాలంటే కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అవసరమన్నారు. గతంలో వర్గీకరణకు సహకరించింది చంద్రబాబే అన్నారు. ఫిబ్రవరి 6,7,8 తేదీల్లో సుప్రీం కోర్టులో ఎస్సీవర్గీకరణ వాదనలు జరిగితే రాష్ట్రప్రభుత్వం తరపున న్యాయవాదిని నియమించడం కాని, వర్గీకరణపై జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడలేదని పేర్కొన్నారు. వర్గీకరణకు అనుకూలంగా ఉన్న పార్టీలకే తమ మద్దతు ఉంటుందన్నారు. ఈనెల 22న చింతలపూడిలో కూటమి అభ్యర్థి సొంగా రోషన్‌కుమార్‌ నామినేషన్‌ వేస్తున్న సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంఘాలు, ఇన్‌చార్జిలు, మహిళలు, యువకులు పెద్దఎత్తున పాల్గొనాలన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు సీ హెచ్‌ విజయ, సొంగా నక్షత్రం, మేరీ, నాగేంద్ర, సుగుణ, జుజ్జువరపు వాసు, మల్లికార్జున్‌, ముక్తేశ్వరరావు, అరుణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం అని ఎమ్మార్పీఎస్‌ నాయకులు పేర్కొన్నారు.

గణనీయంగా టీడీపీలోకి పెరిగిన చేరికలు

పెదవేగి, ఏప్రిల్‌ 21 :ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీల్లో చేరుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి చిన్నాన్న కుమారుడు భరత్‌ భూషణ్‌ శనివారం సోదరుడిని కాదని.. వైసీపీని వీడి చింతమనేని ప్రభాకర్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆదివారం ఉదయం పెదవేగి, దెందులూరు, ఏలూరు రూరల్‌ మండలాల గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు తమ అనుచరగణంతో టీడీపీలో చేరారు. పార్టీలో చేరినవారికి కండువాకప్పి సాధరంగా ఆహ్వానించిన ప్రభా కర్‌ పార్టీలో చేరడంతో పాటు వచ్చే ఎన్నికల్లో మీ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని సూచించారు. ఏలూరు రూరల్‌ మాదేపల్లి –2 ఎంపీటీసీ సభ్యుడు గండికోట నాగరాజు తన అనుచరులతో కలిసి ఆదివారం చింత మనేని ప్రభాకర్‌ సమక్షంలో టీడీపీలో చేరారు.

Updated Date - Apr 22 , 2024 | 12:18 AM