Share News

వైసీపీ పాలనలో అవినీతిలో తణుకు టాప్‌

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:17 AM

నాడు టీడీపీ హయాంలో నియోజకవర్గాన్ని మూడు పర్యాయాలు నంబర్‌ వన్‌ స్థానంలో నిలపగా నేడు వైసీపీ ప్రభుత్వం అవినీ తిలో నంబర్‌ వన్‌గా నిలిపిందని తణుకు కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.

వైసీపీ పాలనలో అవినీతిలో తణుకు టాప్‌
తణుకులో వాకర్స్‌ సభ్యులతో మాట్లాడుతున్న ఆరిమిల్లి

తణుకు, మార్చి 27: నాడు టీడీపీ హయాంలో నియోజకవర్గాన్ని మూడు పర్యాయాలు నంబర్‌ వన్‌ స్థానంలో నిలపగా నేడు వైసీపీ ప్రభుత్వం అవినీ తిలో నంబర్‌ వన్‌గా నిలిపిందని తణుకు కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. బుధవారం వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులతోను, కూరగాయల మార్కెట్‌లో చిరు వ్యాపారులతో ఆయన మాట్లాడారు. టీడీఆర్‌ బాండ్స్‌ స్కామ్‌ ద్వారా కోట్ల రూపాయలు దోచుకోవచ్చని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తణుకును నమూనా చేశారని తెలిపారు. టీడీపీ హయాంలో మాస్టర్‌ ప్లాన్‌ అమలు, సీసీ రోడ్లు, డ్రెయిన్లు, పార్కింగ్‌ సమస్యలను పరిష్కరించారని వాకర్స్‌ గుర్తు చేసుకున్నారు. కారుమూరి కప్పం కోసం నిర్మాణాలు సైతం నిలిపివే స్తున్నారని కూలీలు ఆరిమిల్లితో అన్నారు. అందరి సమస్యలు పరిష్కారం కావాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయంతో అన్ని రంగాలు ఊపందుకుంటాయన్నారు. టీడీపీ నాయకులు బసవా రామకృష్ణ, కలగర వెంకట కృష్ణ, కొండేటి శివ, తాతపూడి మారుతీరావు, తోట సూర్యనారాయణ, గుమ్మళ్ళ హనుమంతు, బట్టువల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

కూటమితోనే దళితవాడల అభివృద్ధి : సాయిబాబు

ఇరగవరం, మార్చి 27 :కూటమి గెలుపుతోనే దళితవాడలు అభివృద్ధి చెందుతా యని జడ్పీటీసీ మాజీ సభ్యుడు, టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు చుక్కా సాయిబాబు అన్నారు. తణుకు కూటమి అభ్యర్థి రాధాకృష్ణ విజయానికి సహ కరించాలని కోరుతూ బుధవారం మండలంలోని పొదలాడ, కంతేరు గ్రామా ల్లోని ఎస్సీ కాలనీల్లో ఆయన పర్యటించారు. జగన్‌ ప్రభుత్వంలో సబ్‌ ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టించారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదని, దళితులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గ ఎస్సీ సెల్‌ కార్యదర్శి కారెం బాబూరావు, కొల్లి అప్పారావు, ముప్పి డి నరసింహమూర్తి, బొంత చిట్టిబాబు, గెడ్డం లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

పెదగరువులో నిమ్మల సూర్యకుమారి ప్రచారం

పాలకొల్లు రూరల్‌, మార్చి27 : రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విజయాన్ని కోరుతూ ఆయన సతీమణి సూర్యకుమారి పెదగరువు గ్రామంలో బుధవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకు లకు గ్రామస్థులు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో భూపతి పెద్దిరాజు, శ్రీను, కె.పగణేష్‌, దాశింశెట్టి దేవదాసు, దొడ్డ సురేంద్ర, దొడ్డ శ్రీనివాసరావు, దొడ్డ శేషారత్నం, నాగేశ్వరరావు, కె.జానకీరామారావు, ఎం.రామకృష్ణ, షేక్‌ చిన్నలలితకుమారి, బండారు ఆదిలక్ష్మి, ద్రాక్షారపు జ్యోతి పాలా విజయకుమారి, తాళ్ళూరి విజయలక్ష్మి, తమ్మా లక్ష్మి, జ్యోతి, గూడూరి భవాని, పాముల సుజాత, నిల్లా వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

30 మంది జనసేనలోకి..

గణపవరం, మార్చి 27: వైసీపీ ప్రభుత్వం రాష్ర్టానికి చేసింది శూన్యమని ఉంగుటూరు నియోజకవర్గ జనసేన కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు అన్నారు. గణపవరంలో వేగేశ్న గనిరాజు, రామరాజు, సూతాని సాయి, మామిడాల మణికంఠ, ముత్యాల సాయితో పాటు 30 మందికి ధర్మరాజు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో జనసేన కూటమిని గెలిపించాలని పిలపునిచ్చారు. టీడీపీ మండల అధ్యక్షుడు రామకృష్ణర రాజు, జనసేన మండల నాయకుడు తోట శ్రీనివాసరావు, గణప వరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు కూసంపూడి సురేంద్రకుమార్‌రాజు, యువత అధ్యక్షుడు కాపారం చిన్న, మైనార్టీ నాయకుడు బషీర్‌ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి మహా పాదయాత్ర : ధర్మరాజు

గణపవరం మండలం మొయ్యేరు నుంచి గురువారం ప్రారంభించి మూడు రోజులపాటు మహా పాదయాత్ర చేపట్టనున్నట్టు కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు ఓ ప్రకటనలో తెలిపారు. మొయ్యేరులో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై పిప్పర చేరుకుంటుంది. అల్పాహారం అనంతరం పిప్పర నుంచి ఎ.గోపవరం, ముగ్గళ్ళ, అర్థవరం, వరదరాజపురం, గణపవరంలోని గొల్లలది బ్బల్లో పర్యటన సాగుతుంది. భోజనం అనంతరం గణపవరం సెంటర్‌కు చేరు కుంటుంది. బొబ్బిలి వంతెన దాటి నిడమర్రు మండలంలోకి చేరుకుంటుంది. జనసేన, టీడీపీ, బీజేపీ, నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. జనసేనలో భారీ చేరికలు

నరసాపురం, మార్చి 27 : మండలంలోని వేములదీవి గ్రామానికి చెందిన సుమారు 100 మంది వైసీపీకి రాజీనామా చేసి బుధవారం రాత్రి జనసేనలో చేరారు. వీరికి జనసేన అభ్యర్ధి బొమ్మిడి నాయకర్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కొయ్యలగడ్డ కొండయ్య, కోపనాతి సత్యనారా యణ, సంగాని నాగేశ్వరరావు, తిరుమాని రాజు, మార్రాజు, కొల్లు ఇజ్రాయల్‌ తదితరు లు ఉన్నారు. ఈ సందర్భంగా నాయకర్‌ మాట్లాడుతూ వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో తోట శ్రీధర్‌ వలవల నాని, ఆకన చంద్రశేఖర్‌, వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:17 AM