వైసీపీ పాలనలో పన్నుల బాదుడు
ABN , Publish Date - Feb 09 , 2024 | 12:06 AM
వైసీపీ అరాచకపాలనకు స్వస్తి చెప్పాలని, వైసీపీ సంక్షేమం ముసుగులో ప్రజలపై విపరీతంగా పన్నులు భారం మోపిందని టీడీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు విమర్శించారు.
టీడీపీ నూజివీడు ఇన్‌చార్జి ముద్దరబోయిన విమర్శ
చాట్రాయి, ఫిబ్రవరి 8: వైసీపీ అరాచకపాలనకు స్వస్తి చెప్పాలని, వైసీపీ సంక్షేమం ముసుగులో ప్రజలపై విపరీతంగా పన్నులు భారం మోపిందని టీడీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు విమర్శించారు. చిత్తపూరులో గురువారం సాయంత్రం ‘బాబు ష్యూరిటీ భవిషత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి టీడీపీ సూపర్‌సిక్స్ పథకాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. టీడీపీ నాయకులు పలగాని దుర్గారావు, నోబుల్ రెడ్డి, తల్లాడ శ్రీనివాసరావు, బుచ్చిబాబు, సంగీతరావు, అత్తులూరి శ్రీనివాసరావు, దామెర చిట్టిబాబు, రామదాసు పాల్గొన్నారు.
టీడీపీ–జనసేన కూటమిని గెలిపించాలి : కొడాలి వినోద్
ముదినేపల్లి, ఫిబ్రవరి 8 : రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ–జనసేన కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉందని టీడీపీ కైకలూరు నియోజకవర్గ పోల్ మేనేజ్‌మెంట్ ఇన్‌చార్జి కొడాలి వినోద్ అన్నారు. గురువారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి పేరూరు, తేరగూడెం గ్రామాల్లో భవిష్య త్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాకరం–పేరూరు రహదారి, తేరగూడెం రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోవడం, పోల్‌రాజ్ మేజర్ డ్రెయిన్‌పై వంతెన కూలిపోయి మూడేళ్లు గడిచినా కొత్తవంతెన నిర్మా ణం చేపట్టకపోవడం దారుణమని విమర్శించారు. పార్టీ నాయకులు జాస్తి రాజా, పంతగాని సురేష్, బొంగు రవికుమార్, ఈడే సుధాకర్, యర్రా రాంబా బు, సునీత, బొమ్మినంపాడు సర్పంచ్ దారం సుధ, కందేపి పద్మ పాల్గొన్నారు.