Share News

కూటమితోనే నవ్యాంధ్ర పునఃనిర్మాణం

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:21 AM

నవ్యాంధ్ర పునఃనిర్మాణం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూటమి ప్రభు త్వంతోనే సాధ్యమని ఏలూరు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మ డి అభ్యర్థి బడేటి రా ధాకృష్ణయ్య (చంటి) అన్నారు.

కూటమితోనే నవ్యాంధ్ర పునఃనిర్మాణం
ఏలూరులో మినీ మేనిఫెస్టో వివరిస్తున్న చంటి

ఏలూరు ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య

ఏలూరుటూటౌన్‌, ఏప్రిల్‌ 18 :నవ్యాంధ్ర పునఃనిర్మాణం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూటమి ప్రభు త్వంతోనే సాధ్యమని ఏలూరు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మ డి అభ్యర్థి బడేటి రా ధాకృష్ణయ్య (చంటి) అన్నారు. గురువారం ప్రజాసంకల్ప యాత్ర 22వ డివిజన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధేనని, గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. మంచి జరిగితే ఓటేయాలని జగన్‌ అడుగుతున్నారన్నారు. అసలు మంచి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. మళ్లీ ప్రజలను జగన్‌ మోసం చేయాలని మాటలతో మాయ చేస్తున్నా డన్నారు. ఈసారి మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరని, రానున్న ఎన్నికల్లో కూటమికి సంపూర్ణ ప్రజామద్దతు ఉందన్నారు. పాదయాత్రలో ఆయన ప్రజాస మస్యలు అడిగి తెలుసుకున్నారు. సూపర్‌ సిక్స్‌ కరపత్రాలను అందించి అవగాహన కల్పించారు. ప్రజలు వివరించే సమస్యలను కూటమి ప్రభుత్వం రాగానే పరిష్కరి స్తామన్నారు. కార్యక్రమంలో శివప్రసాద్‌, కాశీనరేష్‌, నిర్మలకుమారి, రామకృష్ణ, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 29వ డివిజన్‌ లంకపేటలో సంకల్పయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి రెడ్డి అప్పలనాయు డు, మధ్యాహ్నపు ఈశ్వరి బలరామ్‌ దంపతులు, శివ, గాది రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:37 AM