టీడీపీ–జనసేన కూటమితోనే అభివృద్ధి సాధ్యం
ABN , Publish Date - Mar 03 , 2024 | 12:11 AM
తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటైతేనే అభివృద్ధి సాధ్యమని, కూటమి అభ్యర్థులకు గెలిపించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు కోరారు.
గ్రామాల్లో టీడీపీ మేనిఫెస్టోతో ప్రచారం
ఉంగుటూరు, మార్చి 2: తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటైతేనే అభివృద్ధి సాధ్యమని, కూటమి అభ్యర్థులకు గెలిపించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు కోరారు. మండలంలోని నీలాద్రిపురంలో శనివారం మన ఇంటికి మన గన్ని కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నియోజకవర్గ, మండల స్థాయి, గ్రామస్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏలూరు టూటౌన్: ప్రజాస్పందన చూస్తుంటే రానున్న ఎన్నికల్లో వైసీపీ కనుమరుగు కావడం ఖయమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడేటి చంటి అన్నారు. శాంతినగర్, వినాయకనగర్‌లో బడేటి చంటి ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్ని వర్గాల ప్రజలు వాపోతున్నారని చంటి తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్–6 పథకాలపై ప్రజలు ఆకర్షితు లు అవుతున్నారన్నారు. రోజురోజుకు కూటమికి ఆదరణ పేరుగుతుం దన్నారు. సొంత చెల్లెలుతోపాటు డాక్టర్ సునీత మా అన్నకు ఓటు వేయ వద్దని కోరడం జగన్ ఎటువంటి వ్యక్తో అర్థమవుతుందన్నారు. అట్లూరి రామ కృష్ణ, భాస్కరరావు, కిశోర్, శ్రీనివాస్, బాబురావు, బెనర్జి, రమేష్, పాల్గొన్నారు.
వైఎస్ సునీత న్యాయ పోరాటానికి మద్దతు
భీమడోలు: వైఎస్ సునీత న్యాయపోరాటంలో ఆమెకు టీడీపీ అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అన్నారు. గుండుగొలనులో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డిని హత్యచేసిన వారికి శిక్ష పడాలని లేకపోతే రాష్ట్రంలోని పౌరులు మాన ప్రాణాలకు రక్షణ ఉండదన్నారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అర్హత లేదని, ఆడబిడ్డకు న్యాయం చేయలేని సీఎం రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెళ్లకు ఏమి న్యాయం చేస్తాడని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు శిరిబత్తిన కొండబాబు గృహ ఆవరణలో సమావేశం జరిగింది. పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బుట్టాయగూడెం: రాజకీయ లబ్ధికోసమే వివేకానందరెడ్డిని హతమార్చారని టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ అన్నారు. వివేకా నందరెడ్డి హత్య కేసులో జగన్‌రెడ్డి పాత్రపై విచారణ జరగాలని కోరారు. వివేకానందరెడ్డి గొడ్డలిపోటుతో చనిపోయినట్లు జగన్‌రెడ్డి ఎలా చెప్పగలి గారని, సీబీఐ విచారణ ఎందుకు వద్దన్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు.
జంగారెడ్డిగూడెం: బాబాయ్ వివేకానంద హత్యతో శవ రాజకీయాలు చేసిన జగన్మోహనరెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలని నియోజకవర్గ అభ్యర్థి సొంగా రోషన్‌కుమార్ అన్నారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ బాబాయ్ వివేకానంద హత్య కేసులో జగన్ పాత్రపై విచారణ జరపాలన్నారు. చెల్లెలికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్రాన్ని ఉద్దరిస్తారా అని ప్రశ్నించారు. సునీతమ్మ పోరాటంలో అర్ధం ఉందన్నారు. తన కన్న తండ్రి ఎలా చనిపోయారో అనే విషయంపై ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. జగన్ అధికారా న్ని అడ్డం పెట్టుకుని హత్యరాజకీయం చేస్తున్నారన్నారు. జగన్ కుట్రలను ప్రజల అర్ధం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యబద్దమైన టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, నాయకులు మండవ లక్ష్మణరావు, షేక్ ముస్తఫా, రావూరి కృష్ణ, పెనుమర్తి రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పెదవేగి: వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్‌రెడ్డి పాత్రపై పూర్తిస్థాయి విచారణ జరగాలని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ డిమాండ్ చేశారు. గొడ్డలి వేటుతోనే బాబాయ్ చనిపోయారని జగన్‌రెడ్డి అంత కచ్చితంగా చెప్పడం అనుమానాలకు తావిస్తుందన్నారు. తొలుత సీబీఐ విచారణ కోరిన జగన్, ఆపై ఎందుకు వద్దంటున్నాడని ప్రశ్నించారు. వివేక మృతి వెనుక జరిగిన సంఘటనలన్నీ జగన్‌రెడ్డికి తెలుసని, ఎందుకు దీనిని దాచాలనుకుంటున్నారు. తండ్రి హత్యకు న్యాయం చేయాలని కుమార్తె పోరాడుతుంటే, తమ్ముడిని సీబీఐ అరెస్టు చేయకుండా జగన్ ఎందుకు అడ్డు పడ్డారని, అవినాష్‌ను అరెస్టు చేయడానికి వెళ్తే కర్నూలులో ఉద్రిక్తత వాతావరణాన్ని సృష్టించింది వైసీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని, ప్రజలే తగిన శిక్ష విధిస్తారన్నారు.