Share News

160 సీట్లతో టీడీపీ–జనసేన విజయం ఖాయం

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:37 AM

‘సీఎం జగన్‌ అరాచకాలు, మోసాలతో ప్రజలు విసుగు చెందారు. ప్రజా స్వామ్య విలువలు కాపాడటానికి తిరిగి చంద్రబాబు ముఖ్య మంత్రి కావాలని ప్రజలు కోరుతున్నారు’ అని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. చింతలపూడి లో ఈ నెల 5న జరిగే చంద్రబాబు ‘రా.. కదలిరా’ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

160 సీట్లతో టీడీపీ–జనసేన విజయం ఖాయం
ఏలూరులో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నేతలు

చింతలపూడిలో ఈ నెల 5న చంద్రబాబు ‘రా కదలిరా’ సభకు తరలి రావాలని నేతల పిలుపు

ఏలూరు రూరల్‌/చింతలపూడి, ఫిబ్రవరి 1 : ‘సీఎం జగన్‌ అరాచకాలు, మోసాలతో ప్రజలు విసుగు చెందారు. ప్రజా స్వామ్య విలువలు కాపాడటానికి తిరిగి చంద్రబాబు ముఖ్య మంత్రి కావాలని ప్రజలు కోరుతున్నారు’ అని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. చింతలపూడి లో ఈ నెల 5న జరిగే చంద్రబాబు ‘రా.. కదలిరా’ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పర్య టన ఏర్పాట్లపై ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాల యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓట్ల కోసం కులగణన పేరుతో బీసీలను, డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని, ఇన్ని రోజులు వీరు గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన రాష్ట్రంలో 150 నుంచి 160 సీట్లు సాధిస్తుందన్నారు. ఏలూరు జిల్లా టీడీపీ కన్వీనర్‌ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన చేత కాని సీఎం జగన్‌ ఆటవిక పాలన సాగిస్తున్నారని, ఆ పాలన ను అంతం చేసి రాష్ట్రం స్వర్ణయుగం సాధించేందుకు ఈ సభ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సభకు టీడీపీ, జనసేన కార్య కర్తలు, నాయకులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు కేఎస్‌ జవహర్‌, దేవినేని ఉమ, పీతల సుజాత, మాజీ ఎంపీలు కొనకళ్ళ వెంకటనారాయణ, మాగంటి వెంకటే శ్వరరావు మాట్లాడుతూ జగన్‌ దిగిపోతేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లు చింతమనేని ప్రభాకర్‌, ఘంటా మురళి, ఆరిమిల్లి రాధా కృష్ణ, నియోజవర్గాల ఇన్‌చార్జ్‌లు బడేటి చంటి, బొరగం శ్రీని వాసరావు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, వలవల బాబ్జి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు దాసరి ఆంజనేయులు, జి.శ్రీరామ్మూ ర్తి, దాసరి శ్యామ్‌సుందర శేషు, కె.నాగేశ్వరరావు, మెంటే పార్ధ సారఽథి, జగ్గవరపు ముత్తారెడ్డి, సొంగా రోషన్‌కుమార్‌, బొమ్మా జి అనిల్‌, కె.నవీన్‌కుమార్‌, ఆకుమర్తి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతలపూడిలోని చంద్రబాబు ‘రా.. కదలిరా’ బహిరంగ సభ ప్రాంగణంలో ఏర్పాట్లను టీడీపీ నాయకులు పరిశీలించారు.

Updated Date - Feb 02 , 2024 | 12:37 AM