Share News

ప్రజలు బటన్‌ నొక్కితే వైసీపీ ఇంటికే..

ABN , Publish Date - Apr 04 , 2024 | 12:07 AM

రాష్ట్రంలో అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి బటన్‌ నొక్కేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏలూరు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి అన్నారు.

ప్రజలు బటన్‌ నొక్కితే వైసీపీ ఇంటికే..
ప్రజాగళం సభలో మహేష్‌యాదవ్‌, బడేటి చంటి, అప్పలనాయుడు

జగన్‌ పాలనలో అన్నివర్గాలకు నష్టం

కూటమిని గెలిపించాలని టీడీపీ శ్రేణుల ప్రచారం

ఏలూరు రూరల్‌, ఏప్రిల్‌ 3: రాష్ట్రంలో అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి బటన్‌ నొక్కేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏలూరు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి అన్నారు. 26వ డివిజన్‌లో బుధవారం ప్రజా సంకల్పయాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు. చంటి మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు జగన్‌చెప్పిన మాయమాటలు నమ్మి జనం మోస పోయారని, ఇప్పుడు వాస్తవాలు తెలుసుకుని జగన్‌ నిజస్వరూపం ప్రజలకు అర్థమవుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటుతో బుద్ధిచెప్పాలని ప్రజాసంక్షేమాన్ని కాంక్షించే ఆ కూటమికి విజయం చేకూర్చాలని ఆయన కోరారు. పార్టీ నగర అధ్యక్షుడు టి.శివప్రసాద్‌, జనసేన నగర అధ్యక్షుడు ఎన్‌.కాశీనరేష్‌, రెడ్డిగౌరీశంకర్‌, వీరంకి పండు, గూడవల్లి వాసు, చేకూరి గణేష్‌, మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు, సోమిశెట్టి రామ్మోహన్‌ రావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

మద్యం అమ్మించారు.. పింఛన్లు ఇవ్వలేరా : పుట్టా

ఏలూరు రూరల్‌: జే బ్రాండ్‌ మద్యం అమ్మకాల కోసం మద్యం దుకాణాల వద్ద టీచర్లు, వీఆర్వోలను నిలబెట్టిన సైకో జగన్‌ పింఛన్ల పంపిణీకి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌కుమార్‌ యాదవ్‌, బడేటి చంటి, జనసేన ఇన్‌చార్జ్‌ రెడ్డి అప్పలనాయుడు డిమాండ్‌ చేశారు. 48వ డివిజన్‌ మెట్లకోనేరు వద్ద వినాయక స్వామిగుడి వద్ద నిర్వహించిన ప్రజా గళం సభలో వారు పాల్గొన్నారు. కుట్రపూరితంగా వైసీపీ ప్రభుత్వం ఫెన్షన్లు జాప్యం చేసి, ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశా రు. అవ్వాతాతలకు ఇవ్వాల్సిన ఫెన్షన్‌ సొమ్మును తమ తాబేదారులకు దొడ్డి దారిన పంచిపెట్టిన జగన్మోహన్‌రెడ్డి ఖజానా మొత్తాన్ని ఊడ్చేసి, ఎన్నికలకు ముందు గ్లోబెల్స్‌ ప్రచారానికి తెరలేపారని వారు మండిపడ్డారు. సచివాలయ సిబ్బంది, సెర్ప్‌ సిబ్బంది, వీఆర్వోలతో ఫెన్షన్ల పంపిణీకి ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. వందనాల శ్రీనివాసరావు, ఆర్నేపల్లి తిరుపతిరావు, సరిది కృష్ణవేణి, మాగంటి హేమసుందర్‌, జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.

తాడిచర్లలో టీడీపీ శంఖారావం

కామవరపుకోట: ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్దులను గెలిపించాలని కోరుతూ బుధవారం తాడిచర్లలో సర్పంచ్‌ పార్థసారఽథిబాబు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను పచ్రారం చేశారు. కార్యక్రమాల్లో టీడీపీ నేతలు వేముల హనుమంతు, బొర్రా రాంబాబు, గుల్లా నాగేశ్వరరావు, యలమర్తి శ్రీనివాసరావు, వెలిశెట్టి బాల మురళి, గంగుల పోతురాజు, తోట రాంబాబు తదితరులు పాల్గొన్నారు..

ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తాం

టి.నరసాపురం: సార్వత్రిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు అన్నారు. మండ లంలో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ముందుగా శివాలయంలో పార్టీ నాయకులతో కలసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడుతూ యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు మహిళలు కూటమి వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలరాజు నియోజకవర్గానికి ఏమీ చేయలేదన్నారు. ఆయన ఓడిపోతారని తెలిసి ఆయన భార్యను ఎన్నికల్లో నిలబెడుతున్నాడని చిర్రి బాలరాజు అన్నారు. ఎవరు పోటీలో ఉన్నా తన గెలుపు ఖాయమని, గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. కూటమి అధికారం లోకి వస్తే 50 ఏళ్లు దాటిన వారికి రూ.4వేలు పింఛను, మూడు గ్యాస్‌ బండ లు ఉచితం వంటి సూపర్‌ సిక్స్‌ పథకాలు వివరించారు. జనసేన నాయ కులు అడపా నాగరాజు, మధ్యాహ్నపు పెంటారావు, జట్లా సత్యనారాయణ, పూనెం ఆదిత్య, మాండ్రు రాంబాబు, నవీన్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్‌

పెదవేగి: అప్పుల ఆంధ్రాగా మారిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి దిశగా నడిపించాలంటే టీడీపీతోనే సాధ్యమని పెదవేగి సర్పంచ్‌ తాతా శ్రీరామ్మూర్తి అన్నారు. బాబు ష్యూరిటీ– భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా బుధ వారం రాత్రి ఇంటింటికి తిరిగి భవిష్యత్‌ గ్యారంటీ కరపత్రాలను అందిం చారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధికి ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే రాష్ట్రం సుభిక్షంగా, ప్రశాంతంగా ఉందని, వైసీపీ పాలనలో రాష్ట్రం రావణకాష్టంగా మారిందని, టీడీపీ అధికా రంలోకి వస్తేనే రాష్ట్రంలో ప్రశాంతత నెలకొంటుందన్నారు. ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్ధి చింతమనేని ప్రభాకర్‌ను గెలిపించాలని ఆయన కోరారు. పార్టీ నాయకులు తాతా సత్యనారాయణ, కంచెన మోహనరావు, సుబ్బారావు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2024 | 12:07 AM