Share News

జగన్‌ పాలనలో వ్యవస్థలు అస్తవ్యస్తం

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:22 PM

జగన్‌ రెడ్డి పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన జగన్‌ చరిత్రహీను డిగా మిగిలిపోతారని టీడీపీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బడేటి చంటి మండిపడ్డారు.

జగన్‌ పాలనలో వ్యవస్థలు అస్తవ్యస్తం
టీడీపీలో చేరిన వారితో చింతమనేని అభివాదం

ఏలూరు రూరల్‌, ఫిబ్రవరి 1: జగన్‌ రెడ్డి పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన జగన్‌ చరిత్రహీను డిగా మిగిలిపోతారని టీడీపీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బడేటి చంటి మండిపడ్డారు. ఏలూరు 16వ డివిజన్‌ వంగాయగూడెం అంబేడ్కర్‌ విగ్రహం నుంచి గురువారం నిర్వహించిన ప్రజాసంకల్పయాత్రలో ఆయన పాల్గొ న్నారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ మినీ మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌ పథకాలు వివరించారు. ప్రతిచోటా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అంటూ ప్రేమ ఒలకబోసే జగన్మోహన్‌రెడ్డి ఎస్సీల సంక్షేమానికి ఏం చేశారో చెప్పాలని చంటి డిమాండ్‌ చేశారు. వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాల గురించి టీడీపీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళి ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించడం తధ్యమన్నారు. చోడే వెంకటరత్నం, శ్రీకాకుళం రమేష్‌, ఆలూరి రవి, కలపాల కుమార్‌, ఆలూరి కిషోర్‌, తలపంటి రాంబాబు, సకల బత్తుల దివాకర్‌, కాటూరి శ్రీను, చల్లా రాఘవ, కొత్తపల్లి రాజు, శ్రీకాకుళం రాజు, శ్రీకాకుళం నాగరాజు, డేవిడ్‌ తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

పెదవేగి: అరాచక పార్టీ అంతం ప్రారంభమైందని, త్వరలోనే ఖాళీ అవుతుందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. పెదకడిమిలో 25 కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు పులుసూరి వెంకట కుటుంబ రావు, చల్లగొళ్ళ శివగోపాలకృష్ణ, ఉండవల్లి నాగగేశ్వరరావు, ముసునూరి దశరధరామయ్య, కొసరాజు జగన్మోహనరావు, విక్రమ్‌, హరీష్‌, కోటేశ్వరరావు, సత్యనారాయణ, సుమంత్‌, విజయకుమార్‌ తదితరులు చింతమనేని సమ క్షంలో గురువారం టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరం గా ఆహ్వానించారు. ప్రభాకర్‌ మాట్లాడుతూ వైసీపీ అంతానికి సమయం దగ్గర పడిందన్నారు. ప్రశ్నించినవారిపై దాడులు, బాధితులపైనే కేసులు.. ఇదీ వైసీపీ నడుపుతున్న రాజ్యాంగమని, దీనికి త్వరలోనే ప్రజలే ముగింపు పలుకుతారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ దురాగతాలు తెలుసుకున్న వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వస్తున్నారని, దీనికి ఉదాహరణ పెదకడిమిలో వైసీపీకి చెందిన 25 కుటుంబాల నాయకులు ఒకేసారి టీడీపీలో చేరడమేనన్నారు. అక్రమాలకు పాల్పడిన ఏ నాయకుడికి మినహాయింపు ఉండబోదని, ఆర్థిక నేరాలకు పాల్పడిన ప్రతి ఒక్కరూ బోనెక్కాల్సిందేనని ప్రభాకర్‌ స్పష్టం చేశారు. సర్పంచ్‌ కొసరాజు బలరామ కృష్ణ చౌదరి, చల్లగొళ్ళ గోపాలకృష్ణ, బొప్పన సుధాకర్‌ పాల్గొన్నారు.

5న రా.. కదలి రా సభ విజయవంతం చేద్ధాం

దెందులూరు: చింతలపూడిలో ఈ నెల 5న జరిగే రా.. కదలిరా సభను విజయవంతం చేసేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరావు అన్నారు. సోమవరప్పాడులో నాలుగు మండలా పార్టీ అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు మఖ్య నేతలతో సమీక్ష సమవేశం నిర్వహించారు. సభ విజయవంతం చేసేందుకు తీసుకోవల్సిన చర్యలపై సూచనలు చేశారు. మాగంటి సురేంద్రనాథ్‌ చౌదరి, చెన్ను గాంధీ, మద్దిపాటి వెంకటరాజు, మాగంటి నారాయణప్రసాద్‌, మోతుకూరి నాని, యిప్పిలి వెంకటేశ్వరావు, పెనుబోయిన మహేష్‌యాదవ్‌, నాగనబోయిన సత్యనారాయణ, బోడేటి మోహన్‌బాబు, ఏనుగు రామకృష్ణ. నున్న లక్షణ్‌ బాబు. గారపాటి కొండయ్యచౌదరి, కసూకుర్తి రామకృష్ణ, నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 11:22 PM