Share News

సంక్షేమం కాదు సంక్షోభం

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:12 AM

జగన్‌ పాలనలో రాష్ట్రంలో సంక్షేమం లేదని, అంతా సంక్షోభమేనని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ధ్వజమెత్తారు.

సంక్షేమం కాదు సంక్షోభం
కె.కన్నాపురంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నాయకులతో చింతమనేని

వైసీపీ పాలనపై చింతమనేని ధ్వజం

పెదవేగి, జనవరి 11: జగన్‌ పాలనలో రాష్ట్రంలో సంక్షేమం లేదని, అంతా సంక్షోభమేనని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ధ్వజమెత్తారు. బి.సింగ వరంలో గురువారం జరిగిన బాబు ష్యూరిటీ– భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్ర మంలో వైసీపీ పాలనలో అక్రమాలు, అవినీతిని ఎండగట్టారు. రాష్ట్రం అభి వృద్ధి పథంలో పయనించాలంటే టీడీపీ– జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. బి.సింగవరం– జానంపేట గ్రామాల ప్రజల చిరకాల కోరిక తమ్మిలేరుపై వంతెన నిర్మాణం పూర్తి చేస్తానని ప్రభాకర్‌ హామీ ఇచ్చారు. మరో రెండునెలల్లో ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికల్లో టీడీపీ– జనసేన కూటమి విజయం సాధిస్తుందని, ఆ వెంటనే బ్రిడ్జి నిర్మాణం ప్రారంభిస్తా మని చెప్పారు. దీంతోపాటు సాగునీటి అవసరాలకు అనుగుణంగా నీరు అందుబాటులో ఉండేలా చేస్తామని ప్రభాకర్‌ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బొప్పన సుధాకర్‌, తాతా సత్యనారాయణ, పరసా వీరాస్వామి, మాజీఎంపీపీ దేవరపల్లి బక్కయ్య, పి.నరేష్‌, అడపా శ్రీను, కోదండరామయ్య, వెంకటనారాయణ, దుర్గాప్రసాద్‌, సురేష్‌, జనసేన నాయకులు మధుసూదన్‌, భారీఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు

దెందులూరు నియోజకవర్గంలో పలువురు నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారు. చింతమనేని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాబు ష్యూరిటీ– భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమాల్లో కె.కన్నాపురం, కూచింపూడి, న్యాయంపల్లి, దెందులూరు మండలం పెరుగ్గూడెం గ్రామాలకు చెందిన నాయకులు, తమ అనుచరగణంతో టీడీపీలో చేరారు. అవినీతి, అక్రమాలతో నిండిన వైసీపీలో నాయకుల దందాలు, అసమర్ధ పాలనతో విసిగి, టీడీపీలో చేరుతున్నామని పార్టీ మారిన నాయకులు బండారు రాజు, రాము, జక్కా రాజేష్‌, పెద్దిశెట్టి వెంకటేశ్వరరావు, పూజారి రాటాలు, బాలిన బాలాజీ, నిట్టా కృష్ణ, పెద్దిశెట్టి గంగరాజు, బండారు బాలాజీ. పఠాన్‌ నాగుల్‌ మీరా, కొమ్మిన ప్రసాద్‌, కోట గిరి వాసుబాబు, సీతారామస్వామి, వెల్లంకి సీతారామస్వామి, శ్రీనివాసరావు, అరుణ్‌, చలపాటి వెంకట రమణ, బొబ్బూరి రవికుమార్‌, ఆనంద్‌, చుంచుల రాంబాబు, మల్లవల్లి నవీన్‌, సాయిన నాగేశ్వరరావు, కొమ్మిన గంగరాజు, బాలిన సాయిబాబు తదితరులు తెలిపారు. వారికి చింతమనేని ప్రభాకర్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

వైసీపీలో బీసీలను బలిపశువులను చేస్తున్నారు

జంగారెడ్డిగూడెంటౌన్‌: వైసీపీలో బీసీలను బలిపశువులను చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్‌ చంద్ర శేషు విమర్శించారు. బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబొయిన రామలింగేశ్వరరావు, విశ్వకర్మ రాష్ట్ర డైరెక్టర్‌ చిట్రోజు తాతాజీతో గురువారం విలేకరుల సమావేశం నిర్వహిం చారు. నా బీసీలు అంటూ జగన్‌ తడిగుడ్డతో బీసీల గొంతు కోస్తున్నాడని అన్నారు. పేరుకే బీసీలకు మంత్రి పదవులు కానీ పెత్తనం తన సొంత సామాజిక వర్గాల సామంతరాజులకేనన్నారు. కేవలం ప్రతిపక్ష నేతలను తిట్టడానికి తప్ప తమ శాఖల సమీక్షకు కూడా మంత్రులు పనికిరాకుండా చేస్తున్నారన్నారు. బీసీలకు వైసీపీలో అవమానాలను ఆ పార్టీ ఎంపీ, ఎమ్మె ల్యేలు చెప్పడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. 75 వేల కోట్ల బీసీల సబ్‌ ప్లాన్‌ నిధులను కూడా పక్కదారి పట్టించి, స్థానిక సంస్థల్లో 10శాతం కోత విధించి 16వేల పదవులను బీసీలకు దూరం చేసిన ముఖ్యమంత్రి జగన్‌ అని అన్నారు. వైసీపీలో ఉన్న బీసీలందరు అవమానాలతో బాధపడవద్దని, బయటకు రావాలని శేషు పిలుపునిచ్చారు. చిట్రోజు తాతాజీ మాట్లాడుతూ బీసీలకు గౌరవం ఒక్క తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఉందన్నారు. రానున్న రోజుల్లో బీసీల కోసం రక్షణ చట్టాన్ని కూడా తెస్తామని చంద్రబాబు నాయు డు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూన్నామన్నారు. కార్యక్రమంలో బీసీ నేతలు కొంచాడ ప్రసాద్‌, వీరమళ్ల పోసిబాబు, బూత్‌ ఇంచార్జ్‌ పులపాకుల విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

ఏలూరు టూటౌన్‌: ఎన్నికలు దగ్గర పడుతున్న దృష్ట్యా నాయకులు, కార్యకర్తలు విజయమే లక్ష్యంగా పని చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బడేటి చంటి అన్నారు. క్యాంప్‌ కార్యాలయంలో గురువారం క్లస్టర్‌, డివిజన్‌, బూత్‌ ఇన్‌చార్జ్‌ల సమావేశం నిర్వహించారు. చంటి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని దిశా, నిర్దేశం చేశారు. బూత్‌ఇన్‌చార్జ్‌లు, క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లు అనుసరించాల్సిన వ్యూహాలు వివరించారు. వైసీపీ పరిస్థితి నియోజకవర్గంలో దారుణంగా ఉందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉమ్మడి అభ్యర్థి విజయానికి కృషి చేయాలన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:12 AM