Share News

వైసీపీ శవ రాజకీయాలు మానుకోవాలి

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:09 AM

ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని గార్లమడుగు టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు.

వైసీపీ శవ రాజకీయాలు మానుకోవాలి
గార్లమడుగులో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం

పెదవేగి, జూన్‌ 6: ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని గార్లమడుగు టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. గార్లమడుగు పంచాయతీ సూర్యారావుపేట గ్రామానికి చెంది న యలమంచిలి ప్రవీణ్‌ అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి ప్రకాశరావు పోలీసులకు ఫిర్యాదు చేశారని, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి దీనికి రాజకీయ రంగు పులిమి టీడీపీపై నెపం మోపాలని చూశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం యలమంచిలి ప్రవీణ్‌ తన పొలంలో చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందాడు. పరామర్శకు వచ్చిన అబ్బయ్యచౌదరి టీడీపీ వేధింపుల కారణంగా ప్రవీణ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. అబ్బయ్యచౌదరి ఆరోపణలపై గార్లమడుగు టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అబ్బయ్యచౌదరి ఆరోపణలను ఖండించారు. మృతుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాత్రం టీడీపీ వేధింపులుగా చిత్రీకరించి శవరాజకీయం చేయాలని చూశారన్నారు. నీచ రాజకీయాలను మానుకోక పోతే ప్రజలు నియోజకవర్గం నుంచి తరిమేసే పరిస్థితి వస్తుందని హెచ్చ రించారు. టీడీపీ నాయకులు కొల్లి సత్యనారాయణ చౌదరి, మూతినేని గణేష్‌, గోళ్ళ రమేష్‌, పర్వతనేని చంటి, మేడికొండ సీతారామదాసు, పెన్మెత్స శివరామరాజు, ఈడ్పుగంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 12:09 AM