Share News

అభివృద్ధి చూసి గెలిపించండి

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:05 AM

టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు చూసి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు కోరారు.

అభివృద్ధి చూసి గెలిపించండి
భీమడోలు మండలం కోడూరుపాడులో గన్ని వీరాంజనేయులు రచ్చబండ

గ్రామాల్లో టీడీపీ అభ్యర్థులు, ఇన్‌చార్జిల ప్రచారం

భీమడోలు, ఫిబ్రవరి 25: టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు చూసి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు కోరారు. కోడూరుపాడులో ఆదివారం రచ్చబండ అనంతరం మన ఇంటికి మన గన్ని కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేశారు. అనంతరం గ్రామంలో తెలు గుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. గ్రామంలో పలు కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి శాలువా కప్పి గన్ని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజ్‌కుమార్‌ అనే టీడీపీ కార్యకర్త ఆర్ధిక సహాయంతో 50 మంది పిల్లలకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. గ్రామ ముఖ్య నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌కు కీలకం : బడేటి

ఏలూరు రూరల్‌: రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని, వైసీపీ పాలనకు సమాధికట్టే రీతిలో ప్రజాతీర్పు ఉండాలని టీడీపీ ఏలూరు అభ్యర్థి బడేటి చంటి అన్నారు. శాంతినగర్‌ ఐదో రోడ్డులో ఆయన ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలుసుకుని టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రజా కంటక పాలనకు ప్రజలు విజ్ఞతతో తీర్పు ఇవ్వాలని కోరారు. ఆర్‌ఎన్‌ఆర్‌ నాగేశ్వరరావు, ఎ.రామకృష్ణ, కేతినీడి భాస్కరరావు, కె.కిషోర్‌, వి.బాబురావు, చిట్టూరి శ్రీనివాస్‌, ఎ.రమేష్‌, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీ, జనసేన విజయం ఖాయం : చింతమనేని

పెదపాడు: రానున్న రెండు నెలల్లో నియంత పాలన పోయి టీడీపీ, జన సేన కూటమి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే చింత మనేని ప్రభాకర్‌ తెలిపారు. ఏపూరులో బాబు ష్యూరిటీ – భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమం ఆదివారం జరిగింది. చింతమనేని మాట్లాడుతూ అక్రమార్జన లక్ష్యంగా అధికారం చేపట్టిన జగన్‌రెడ్డి రాష్ట్రంలోని సహజ వనరులను కొల్లగొ ట్టి, ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలతో, మద్యం అమ్మకాలతో, అధిక ధరలతో పేదవాడి జేబుకు చిల్లుపెట్టి నిలువునా దోపిడి చేశారన్నారు. చంద్రన్న ప్రవేశపెట్టిన మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు అన్ని విధాలుగా అండా ఉంటామన్నారు. మహిళలంతా టీడీపీ, జనసేన కూటమికి అండగా నిలవాలని చింతమనేని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకులు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.

సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రజలకు వరం : రోషన్‌

లింగపాలెం: టీడీపీ ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రజలకు వరమని టీడీపీ చింతలపూడి అభ్యర్థి సొంగా రోషన్‌ కుమార్‌ అన్నారు. వేములపల్లిలో గరిమెళ్ళ చలపతిరావు, పాతూరి ప్రభాకర్‌ ఆధ్వర్యంలో బాబుషూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో మేనిఫెస్టో వివరించారు. గ్రామంలో ప్రతి ఒక్కరిని పలుకరిస్తూ చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. మోరంపూడి మల్లికార్జునరావు, పాతూరి ప్రభాకర్‌, బలుసు శ్రీను, పాతూరి మురళీ, నత్తా నాగేంద్ర, బాల మాధవరావు, బొల్లిన పుల్లారావు, మోరంపూడి ప్రసాద్‌, నాయకులు, కార్యకర్తలు బారీగా పాల్గొన్నారు.

జగన్‌ను గద్దె దింపుదాం

కామవరపుకోట: ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తున్న సీఎం జగన్‌ను వచ్చే ఎన్నికల్లో గద్దె దింపుదామని సొంగా రోషన్‌కుమార్‌ పిలుపునిచ్చారు. పాతూరు గ్రామంలోని ఘంటా మురళీ నివాసం వద్ద నాయకులు, కార్యకర్తల తో ప్రచారం చేద్దాం, ఎన్నికలపై చర్చించారు. ఘంటా సుధీర్‌, ఖాన్‌ వజీర్‌, జనసేన మండల కన్వీనర్‌ షేక్‌ వలీ తదితరులు ఉన్నారు.

జంగారెడ్డిగూడెం: చింతలపూడి నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి సొంగా రోషన్‌కుమార్‌ పరిచయ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పట్టణపార్టీ అధ్యక్షుడు రావూరి కృష్ణ పిలుపునిచ్చారు. పట్టణ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. సోమవారం జరిగే పరిచయ కార్యక్రమంలో స్థానిక సమస్యలు, విజయం చేకూర్చే దిశగా కార్యాచరణపై కార్యకర్తలు, నాయకులతో చర్చ జరుగుతుందన్నారు. సమావేశంలో తూటికుంట రాము, పెనుమర్తి రాంకుమార్‌, బొబ్బర రాజ్‌పాల్‌కుమార్‌, నంబూరి రామ చంద్రరాజు, చేను ప్రసాద్‌, అల్లూరి రామకృష్ణ, గుమ్మడి ప్రసాద్‌, గుళ్లపూడి శ్రీదేవి, రమేష్‌, శీలం గోపి, పగడం దినేష్‌, నాయుడు శ్రీను, శీలం రాంబాబు, పితాని నాగు, పిచుపాటి అబిరం, కంచర్ల గణేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 12:05 AM