Share News

రాష్ట్రాన్ని దోచుకున్నారు

ABN , Publish Date - Apr 07 , 2024 | 11:55 PM

వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ధ్వజమెత్తారు.

రాష్ట్రాన్ని దోచుకున్నారు
ఏలూరులో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు, నేతల అభివాదం

వైసీపీ పాలనపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతల ధ్వజం

ఏలూరులో ఉమ్మడి సమావేశం

ఏలూరు టూటౌన్‌, ఏప్రిల్‌ 7: వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. ఏలూరులో ఆదివారం జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సమావేశంలో ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌ యాదవ్‌ మాట్లాడారు. మహేష్‌ యాదవ్‌ మాట్లాడు తూ ఏలూరులో స్థిర నివాసం ఏర్పరచుకుంటానని, అర్థరాత్రి వచ్చినా సమ స్యలు పరిష్కరిస్తా, ఏలూరును స్మార్ట్‌ సిటీగా తీర్చి దిద్దుతానన్నారు. చింతల పూడి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడం తన కల అన్నారు. జగన్‌ అడ్డగోలు సంపాదనతో ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. ప్రజలకు రోజు కు 90 పైసలు ఇచ్చి జగన్‌ రోజుకు రూ.90 కోట్లు అక్రమంగా సంపాదిస్తు న్నాడన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల భూములను కబ్జా చేయడానికి ప్లాన్‌ వేస్తున్నాడన్నారు. అసెంబ్లీ కూటమి అభ్యర్థి బడేటి చంటి మాట్లడుతూ రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని కూల్చివేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ, ఉమ్మడి కార్యకర్తలంతా సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. సమా వేశంలో ఎంఆర్‌డీ బలరామ్‌ దంపతులు, దాసరి ఆంజనేయులు, జనసేన నాయకులు రాఘవయ్య చౌదరి, కాశీ నరేష్‌, గౌరీశంకర్‌, బీజేపీ నాయకులు సుధాకర్‌ కృష్ణ, నాగం శివ, దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ నాయకులు బడేటి చంటిని ఘనంగా సన్మానించారు.

కూటమి ప్రభుత్వంలో సమస్యల పరిష్కారం : రోషన్‌

లింగపాలెం: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సొంగా రోషన్‌ కుమార్‌ లింగపాలెంలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. తమ కాలనీల్లో సరైన సౌకర్యాలు లేవంటూ పలువురు మహిళలు సమస్యలు విన్నవించారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజి సౌకర్యాలు లేవని, వర్షాకాలం వస్తే ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని, సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీని తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గరిమెళ్ళ చలపతిరావు, మోరంపూడి మల్లికార్జున్‌రావు, తాతిన రాధా కృష్ణ, ముసునూరి రాము, గారపాటి బుజ్జియ్య, పిల్లల శ్రీనివాస్‌ యాదవ్‌, అసిలేటి అజయ్‌, గుత్తా సత్య సాయివరప్రసాద్‌, పి.మహేష్‌బాబు, కుర్రా సుబ్రహ్మణ్యేశ్వరవరప్రసాద్‌, రాయంకుల చక్రధరరావు, పాల్గొన్నారు.

కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి

జంగారెడ్డిగూడెం: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చింతలపూడి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్‌ చెరుకూరి శ్రీధర్‌ అన్నారు. పట్టణంలోని ఒకటో వార్డులో ఆదివారం సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు. చింతలపూడి నియోజకవర్గ అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి సొంగా రోషన్‌ కుమార్‌, ఎంపీ అభ్యర్ధి పుట్టా మహేష్‌ యాదవ్‌లను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. మార్కండేయపురం, వెంకటదేవిపురం, బైపాస్‌ ఏరియా, గరుడ పక్షినగర్‌ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. కొండేటి కిషోర్‌, గెడ సుబ్రహ్మణ్యం, బాబి, లక్ష్మణ్‌, మాణికల వెంకటేశ్వరరావు, లక్ష్మి, గద్దె జస్వంత్‌, తదితరులు పాల్గొన్నారు.

కూటమి అభ్యర్థులను గెలిపించాలి : గన్ని

ఉంగుటూరు: రానున్న ఎన్నికలలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్య ర్థులను గెలిపించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు కోరా రు. సీతారాంపురంలో గన్నితో కలసి జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు తో ఆదివారం ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వం రాగానే పరిష్కారం చూపుతామన్నారు.

కాకర్లమూడి, తోట రామచంద్రపురంలో పత్సమట్ల ధర్మరాజు జనంలోకి జనసేన కార్యక్రమంను నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాకర్లమూడి గ్రామానికి చెందిన అడ్వకేట్‌ తోట వీర వెంకట సత్యనారాయణ, జవ్వాది వెంకటేశ్వరరావు, యడ్లపల్లి మురళి, గుండుబోగుల బాలకృష్ణ, రిషిత తదితరులు జనసేనలో చేరారు. నిడమర్రు మండలం భువనపల్లి గ్రామస్ధులు పార్టీలో చేరారు. కైకరం కొత్త బీసీ కాలనీలో చింతల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థు లను గెలిపించాలని ప్రచారం చేశారు. కైకరం సర్పంచ్‌ సలగాల గోపి, కృష్ణ మోహన్‌, కోనా ఆనంద్‌, బొందిలి నాగేంద్ర, యెగ్గిన శ్యామల, లింగంపల్లి మణికంఠ, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

కూటమి విజయంతోనే పోలవరం సాధ్యం : కరాటం

కొయ్యలగూడెం: జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి విజయం సాధిస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని డీసీసీబీ మాజీ చైర్మన్‌ కరాటం రాంబా బు కోరారు. మండలంలోని బయ్యన్నగూడెంలో జరిగిన సమావేశంలో ఆయ న మాట్లాడుతూ రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్త వ్వాలన్నారు. ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌యాదవ్‌, పోలవరం జనసేన పార్టీ అభ్యర్థి చిర్రి బాలరాజును గెలిపించుకోవాలని, మూడు పార్టీలు ఐక్యంతో విజయం సాధించాలని కోరారు. జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు, టీడీపీ నాయకులు మేఘలాదేవి, పారేపల్లి నరేష్‌, వీరస్వామి, జనసేన నాయకులు కరాటం సాయి, దుగ్గిన శ్రీను, రవికుమార్‌, తేజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 11:55 PM