Share News

ఆక్రమణ అడ్డుకున్నాడని.. టీడీపీ కార్యకర్తపై దాడి

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:29 AM

ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటలో పంచాయతీ స్థలాన్ని ఓ ఆక్ర మించుకుని ఇల్లు కట్టుకుంటున్న వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తపై దాడి చేశారు.

ఆక్రమణ అడ్డుకున్నాడని..  టీడీపీ కార్యకర్తపై దాడి
బాధితుడు శివ నాగాంజనేయులును పరామర్శిస్తున్న ఎమ్మెల్యే, నూజివీడు టీడీపీ అభ్యర్థి పార్థసారథి

వైసీపీ శ్రేణులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

ఎమ్మెల్యే పార్థసారథి ఆగ్రహం

ముసునూరు, మార్చి 5 : ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటలో పంచాయతీ స్థలాన్ని ఓ ఆక్ర మించుకుని ఇల్లు కట్టుకుంటున్న వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తపై దాడి చేశారు. బాధితుడు తెలిపిన వివరాలివి.. గ్రామంలోని రెండున్నర సెంట్ల పంచాయతీ స్థలాన్ని వైసీపీకి చెందిన యు.శ్రీనివాసరావు ఆక్రమించుకుని ఇల్లు నిర్మిస్తుం డగా టీడీపీ నాయకుడు ఉప్పే శివ నాగాంజనేయులు స్పం దనలో ఫిర్యాదు చేశారు. దీనిపై సోమవారం సాయంత్రం ఈవోపీఆర్డీ ఎస్వీ శ్రీనివాసరావు, కార్యదర్శి ప్రసాద్‌ విచారణ చేపట్టారు. దీనికి నాగాంజనేయులును పిలిచారు. విచారణ జరుగుతుండగా శ్రీనివాసరావుతో పాటు వైసీపీ కార్యకర్తలు మరో ఐదుగురు పెదకాపు, మారేశ్వరరావు, సుబ్బారావు, పిచ్చేశ్వరరావు, శివరామకృష్ణలు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడిన నాగాంజనేయులు చికిత్స నిమిత్తం నూజివీడు ఏరియా ఆస్పత్రిలో చేరారు. స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకునప్ప టికి పోలీసులు కేసు నమోదు చేయలేదు. కాని నాగాంజ నేయులే తమపై దాడి చేశారని శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దీనిపై ఎమ్మె ల్యే, నూజివీడు టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి వైసీపీ నాయకుల అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న నాగాంజనేయులును ఆయన మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీ స్థల ఆక్రమణను అడ్డుకుంటే విచక్షణా రహితంగా దాడి చేస్తారా ? అంటూ ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడుతూ ‘ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుంటే బాధ్యత గల పౌరుడిగా అడ్డుపడడం నేరమా..? పోలీసులు అధికార పార్టీ నాయకులకే కొమ్ము కాసి వారిపై కేసులు నమోదు చేయకపోవడం దేనికి సంకేతం. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని బాధితుడికి న్యాయం చేయాలి. లేకుంటే ఆందోళ నకు దిగుతాం’ అని పేర్కొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:29 AM