Share News

అధికార పక్షానికి అనువుగా..

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:05 AM

తాడేపల్లిగూడెంలో మున్సిపల్‌ అధికారి స్థానికతపై, నిధుల దుర్వినియోగంపై ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. అయినా ఇప్పటి వరకు చర్యలు లేవు.

అధికార పక్షానికి అనువుగా..

కొందరు అధికారుల తీరుపై అనుమానాలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

తాడేపల్లిగూడెంలో మున్సిపల్‌ అధికారి స్థానికతపై, నిధుల దుర్వినియోగంపై ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. అయినా ఇప్పటి వరకు చర్యలు లేవు.

ఆచంట నియోజకవర్గంలో మాఫియా ఇసుక అక్రమ తవ్వకాలపై గ్రామస్థులు నడుం బిగించి ప్రొక్లెయిన్‌, ట్రాక్టర్‌లను రెడ్‌ హ్యాండెడ్‌గా అధికారులకు పట్టించి ఇచ్చినా.. కనీస విచారణ కూడా లేకుండా తర్వాత వాటిని విడిచి పెట్టేశారు.

సాంస్కృతిక పట్టణ కేంద్రంగా వున్న ఆ నియోజకవర్గం లోని అధికారుల్లో అత్యధికులు ఒకే సామాజిక వర్గం వారు. ఇదే తమకు కలిసి వస్తుందని అధికార పార్టీ నాయకుడు బహిరంగంగా చెబుతున్నారు. ఇక్కడ ఎన్నికల నిబంధనలు మీరుతున్నారంటూ కూటమి అభ్యర్థి ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారుల్లో చలనం లేకపోవడంతో ఆ నేత చెబుతున్న మాట నిజమేననిపిస్తోంది. ఎన్నికలకు ముందే అక్కడి పోలీసు, ఇతర మండల స్థాయి అధికారులు బదిలీ అయ్యారు. అనూహ్యంగా అక్కడ కొత్తగా వచ్చిన వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం.

ఇలా జిల్లాలోని కొందరి అధికారులు అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారం టూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికీ దందాలు ఆగకపోవడంతో ప్రతిపక్ష నేతల విమర్శలకు బలం చేకూ రుస్తోంది. మరోవైపు ఎన్నికల నిబంధనలు పక్కాగా అమ లు చేయాలంటూ జిల్లా కలెక్టర్‌ హెచ్చరిస్తున్నారు. తాడేప ల్లిగూడెం అధికారి విషయమై గత కలెక్టర్‌ చర్యలు తీసుకో వడానికి ఉపక్రమించారు. ఇదే విషయాన్ని అధికార పార్టీ నేతలకు స్పష్టం చేశారు. తీరా కలెక్టర్‌ బదిలీ అయ్యారు. ఎన్నికల ముందు జిల్లా నుంచి బదిలీ చేయడం వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపించాయి. ఎన్నికల కోడ్‌కు ముందే కొత్త కలెక్టర్‌ జిల్లాలో బాధ్యతలు చేపట్టారు. కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు ఎన్నికల నియామవళిపై ఆదేశాలిస్తూనే ఉన్నారు. అయినా సరే అధికారులు అధికా ర పార్టీకి అండదండలు ఇస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవల పట్టణాల్లో బిల్లులు పెద్ద మొత్తంలో చెల్లించారు. జిల్లాలోని ఓ మున్సి పాలిటీలో ఏకంగా రూ.6 కోట్లు బిల్లులు మంజూరుచేశారు. కాంట్రాక్టర్‌లకు చెల్లిస్తే అధికార పార్టీ నాయకులకు ఉపయోగకరంగా ఉంటుంది. కమీషన్‌ రూపంలో నేతలకు కొంత మొత్తం ముట్టచెబుతారు. దీంతో ఎన్నికల ముందు పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించారు. కానీ ఫీజు రీయింబ ర్స్‌మెంట్‌, మహిళలకు వైఎస్‌ఆర్‌ ఆసరా సొమ్ములు చెల్లిం చలేదు. బటన్‌ నొక్కినా సరే రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదు. కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చెల్లించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆరోపణలకు బలం వస్తోంది.

Updated Date - Apr 12 , 2024 | 12:05 AM