Share News

బీసీల అజెండా.. టీడీపీ జెండా

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:20 AM

టీడీపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్‌ చంద్రశేషు అన్నారు.

బీసీల అజెండా.. టీడీపీ జెండా
కొల్లివారిగూడెం జయహో బీసీ సదస్సులో నేతల సంఘీభావం

జయహో బీసీ సదస్సులో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు

బుట్టాయగూడెం, ఏప్రిల్‌ 16: టీడీపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్‌ చంద్రశేషు అన్నారు. తిరుమలాపురంలో టీడీపీ మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ ఆధ్వర్యంలో బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు బూసా సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న శేషు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో బీసీల అభివృద్ధి 30 ఏళ్ల వెనక్కి పోయిందన్నారు. బీసీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబొయిన రామలిం గేశ్వరరావు మాట్లాడుతూ రూ.75వేల కోట్లు సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లిం చారని, టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే కార్పొరేషన్లు పునరుద్ధరించి వచ్చే ఐదేళ్లలో రూ.150లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారని తెలిపారు. యా గంటి సుబ్రహ్మణ్యం, వెలగల సత్యనారాయణ యాదవ్‌, రాగాని రామకృష్ణ, మండవ లక్షణరావు, శీలం వెంకటేశ్వరావు, ఆకుల రాకేష్‌, పులి శివ, పోలోతు ఆంజనేయులు, మరీడు వెంకటేశ్వరరావు, చిత్రోజు తాతాజీ, ఉమా మహేశ్వ రి, కెఎల్‌.ఆనందకుమార్‌, గొల్లమందల శ్రీనివాస్‌, ఎలికే ప్రసాద్‌, గోలి అనిల్‌, లింగాల సత్యనారాయణ, ముళ్ళపూడి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

కూటమి విజయంతో బీసీల రక్షణ చట్టం

కామవరపుకోట: ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని, అనంతరం బీసీల రక్షణ చట్టం అమలులోకి వస్తుందని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ అన్నారు. గుంటుపల్లి పంచాయితీ కొల్లి వారి గూడెంలో మంగళవారం జరిగిన జయహో బీసీ సదస్సుకు టీడీపీ నాయకులు బేతిన వెంకట్రావు అధ్యక్షత వహించారు. ప్రతిష్టాత్మకంగా జరిగే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు అఖండ విజయం సాధించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నియంతగా పరిపాలిస్తున్న జగన్‌ను గద్దె దిం పాలన్నారు. పసుమర్తి పార్ధసారధిబాబు, గూడపాటి కేశవరావు, గోరింక దాసు, జుజ్జూరి బాబ్జి, ఘంటా సుధీర్‌బాబు, కంఠమనేని అంజిమూర్తి, పుష్పరాజ్యం, రేగుంట సురేష్‌, డోలా విజయ్‌, తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నుంచి నాగళ్ళ రాంబాబు మిత్రబృందం దాదాపు 50 కుటుంబాలు టీడీపీలో చేరారు. వారికి ఘంటా మురళి పసుపు కండువాలు కప్పి ఆహ్వానించారు. జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 12:20 AM