Share News

జయహో బీసీ

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:34 PM

జయహో బీసీ బహిరంగ సభ మంగళ గిరిలో మంగళవారం జరుగనుందని, సభను జయప్రదం చేయాలని జన సేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి, బీసీ సగర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ వీరభద్రరావు విజ్ఞప్తి చేశారు.

జయహో బీసీ
పార్టీలో చేరిన వారితో కలసి చింతమనేని అభివాదం

నేడు మంగళగిరిలో భారీ బహిరంగ సభ

విజయవంతం చేయాలని టీడీపీ నేతల పిలుపు

ఏలూరు టూటౌన్‌, మార్చి 4: జయహో బీసీ బహిరంగ సభ మంగళ గిరిలో మంగళవారం జరుగనుందని, సభను జయప్రదం చేయాలని జన సేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి, బీసీ సగర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ వీరభద్రరావు విజ్ఞప్తి చేశారు. బడేటి క్యాంపు కార్యాలయంలో సోమవారం బీసీ నేతల సమావేశం జరిగింది. జయహో సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తారన్నారు. టీడీపీకి బీసీలే వెన్నెముకని, బీసీలంటేనే టీడీపీ అన్నారు. జగన్‌ ప్రతీ బీసీ కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నిధులు లేకుండా చైర్మన్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో బీసీలపై దాడులు అధికమయ్యాయన్నారు. బీసీ కులాలకు న్యాయం జరగా లంటే టీడీపీ, జనసేన కూటమిని గెలిపించాలన్నారు. సోషల్‌ మీడియా రాష్ట్ర కోఅర్డినేటర్‌ జి.గణేష్‌, రెడ్డి రాంబాబు, జిల్లా కన్వీనర్‌ రామకృష్ణ, రెడ్డి రామకృష్ణ, జంపా సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం టౌన్‌: టీడీపీ ఆధ్వర్యంలో మంగళగిరిలో జరగనున్న జయహో బీసీ బహిరంగ సభను జయప్రదం చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి దాసరి శేషు పిలుపునిచ్చారు. పట్టణ బీసీ సెల్‌ అధ్యక్షుడు పాకనాటి అంజి ఆధ్వర్యంలో బీసీ నేతలు సమావేశం నిర్వహించారు. దాసరి శ్యామ్‌ చంద్రశేషు, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు మాట్లాడుతూ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా సభ జరుగుతుందన్నారు. బీసీ వర్గాల వారంతా సభను జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో కోనేటి చంటి, గెడా సుబ్రహ్మణ్యం, కొంచాడ ఉమా ప్రసాద్‌, సీలమంతుల రాంబాబు, మారిశెట్టి బాలకృష్ణ, సందీప్‌, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలోకి వలసలు

ఏలూరు టూటౌన్‌: జగన్‌ పాలనను భరించలేక టీడీపీలోకి వలసలు జరుగుతున్నాయి. 46, 47, 1వ డివిజన్స్‌లోని వైసీపీ, ఇతర పార్టీల కార్యకర్త లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. బడేటి క్యాంపు కార్యాలయంలో పార్టీ టీడీపీ కండువాలతో చంటి స్వాగతం పలికారు. చంటి మాట్లాడుతూ వైసీపీ పాలనతో విసిగిపోయి సోమవారం ఒక్కరోజే వెయ్యి మందికిపైగా టీడీపీలో చేరారన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఎమ్మెల్యే నాని శిలా ఫలకాల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని రానున్న ఎన్నికల్లో నాని ఎత్తుగడలు తిప్పికొట్టాలన్నారు. జగనన్న ఇళ్ల పేరుతో లబ్ధిదారుల నుంచి రూ.35వేలు దోచారన్నారు. టిడ్కో గృహాలను అందజేయలేదన్నారు. జనసేన కార్యకర్తలు నాయుడు సోము ఆధ్వర్యంలో చంటిని కలిసి మద్దతు తెలిపారు.

పెదవేగి: కొల్లేరు రక్షణ, లంక గ్రామాల ప్రజల సంరక్షణ ధ్యేయంగా కృషి చేశానని, ఇకపై కూడా అలాగే చేస్తానని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. గుడివాకలంక గ్రామానికి చెందిన 50 మంది వైసీపీకి చెందిన నేతలు చింతమనేని సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి చింతమనేని టీడీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రభాకర్‌ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా కొల్లేరు గ్రామాల అభివృద్ధికి కృషి చేశానన్నారు. టీడీపీ, జనసేన కూటమిలో కొల్లేటి ప్రజల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. టీడీపీతోనే కొల్లేటి గ్రామాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయనే నమ్మకంతోనే టీడీపీలోకి వచ్చామని పార్టీలో చేరిన గుడివాకలంక నాయకులు పేర్కొన్నారు. ఘంటసాల నాగరాజు, భద్రాజీ, కరుణ, భలే చక్రవర్తి, సైదు అర్జయ్య, త్రిమూర్తులు, నాగబాబు, మోరు రామలక్ష్మణ, శ్రీరాములు, భరతరాజు, నానీ, మల్లుల రాంబాబు, మల్లుల పాండు, మోరు పాండు, విజయ్‌, భూసి, సంజయ్‌, జయమంగళ సాయి, వంశీ, సంతోష్‌, ముంగర వెంకన్న, శ్రీను, నేపాల జగపతి తదితరులు 50మంది వరకు టీడీపీ తీర్ధం పుచుకున్నారు. నంబూరి నాగరాజు, మోరు శ్రావణి, ఘంటసాల వెంకటలక్ష్మి, కుటుంబరావు, సుబ్బరాజు, సైదు సత్యనారాయణ, నేతల రవి, పైడిపాటి శేఖర్‌, జయ మంగళ దొరబాబు, మోరు విజయ రామరాజు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ, జనసేన విజయానికి కృషి చేయాలి

చింతలపూడి: రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన విజయానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఐటీడీపీ మండల అధ్యక్షుడు బాణావతు ఉమా శంకర్‌ అన్నారు. సూపర్‌–6 పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించారు. చదువు కుంటున్న పిల్లలకు రూ. 15 వేలు చొప్పున అందుతాయని, ప్రతీ మహిళకు నెలకు రూ.1500 వస్తాయని, మహిళలకు ఉచితంగా ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం ఉంటుందని, రైతుకు పెట్టుబడి సాయం రూ.20 వేలు అందుతాయని వివరిస్తూ బాబు షూరిటీ పత్రాలు అందజేశారు. కార్యక్రమం లో టీడీపీ నాయకులు ఇస్లావత్‌ నాగేశ్వరరావు, దరావత్‌ ప్రభాకర్‌, జనసేన నాయకులు భూక్యా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మందలపర్రులో గన్ని రచ్చబండ

నిడమర్రు: రాబోయే ఎన్నికలలో సైకో పాలన తరిమి కొట్టి వైసీపీకి గు ణపాఠం చెప్పాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పిలుపు నిచ్చారు. మందలపర్రులో పార్టీ శ్రేణులతో కలసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. రాబోయే ఎన్నికలలో టీడీపీ, జనసేన కూటమికి పలికి ఓటు వేయాలని కోరారు. కార్యకర్తలతో కలసి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో తమ్మినీడి నక్షత్రం, పోశింశెట్టి రాంమూర్తి, ముత్యాల స్వామి, పొట్నూరి సింహాచలం, గఫార్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:34 PM