Share News

కలసి పనిచేద్దాం.. కూటమిని గెలిపిద్దాం

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:07 AM

కలసి పనిచేద్దాం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపిద్దాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ఏలూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి, జనసేన ఇన్‌చార్జి రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు.

కలసి పనిచేద్దాం.. కూటమిని గెలిపిద్దాం
ఏలూరులో టీడీపీ, జనసేన నేతల అభివాదం

టీడీపీ, జనసేన పార్టీ నేతల పిలుపు

ఏలూరు టూటౌన్‌, మార్చి 26: కలసి పనిచేద్దాం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపిద్దాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ఏలూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి, జనసేన ఇన్‌చార్జి రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. జనసేన కార్యాలయంలో చంటి, అప్పలనాయుడు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సమష్టిగా పనిచేసి బడేటి చంటిని 50 వేల మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. జనసేన, టీడీపీ కార్యకర్తలు కలసి క్షేత్రస్థాయిలో పని చేస్తారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు జరిగిన అన్యాయంపై పోరాటం కొనసాగిస్తామన్నారు. కూటమిగా వైసీపీ దౌర్జన్యాలను ఎదుర్కొంటామన్నారు. అనంతరం చంటి మాట్లాడుతూ జనసేన, బీజేపీ నాయకులతో సత్సంబఽధాలు ఉన్నాయన్నారు. అప్పలనాయుడు, తాను ఎవరికి టిక్కెట్టు లభించిన కలసి పనిచేద్దామనే నిర్ణయానికి వచ్చామన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ త్వరలోనే అప్పలనాయుడుతో మాట్లాడి పార్టీ విజయానికి కృషి చేయాల్సినదిగా కోరతారన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కూటమి ప్రభుత్వం నెరవేస్తుందన్నారు. కార్యక్ర మంలో రాఘవయ్య చౌదరి, సిరిపల్లి ప్రసాద్‌, ఓ.శ్రావణ్‌కుమార్‌ గుప్తా, ఎన్‌.కాశీనరేష్‌, శివప్రసాద్‌, చోడే వెంకటరత్నం, రెడ్డి నాగరాజు పాల్గొన్నారు.

టీడీపీలో చేరిన ముస్లింలు

ముస్లింలు టీడీపీలోకి వలసలు వస్తున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి అన్నారు. 8వ డివిజన్‌కు చెందిన ఆసీఫ్‌బేగ్‌ ఆధ్వర్యంలో షరీఫ్‌భాష అస్కర్‌ ఆలీ, షేక్‌ షబీర్‌, షేక్‌ సుభానితో పాటు వందలాది మంది ముస్లిం యువత టీడీపీలో చేరారు. బడేటి క్యాంపు కార్యాలయంలో వారికి పార్టీ కండువా కప్పి చంటి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో చోడే వెంకటరత్నం, శివప్రసాద్‌, మైనార్టీ సెల్‌ ఉపాధ్యాక్షులు అబ్దుల్‌ జఫార్‌ మోజాయిత్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా బడేటి చంటి 23, 24 డివిజన్స్‌లో పర్యటించారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ 6పథకాలను వివరించారు. రాష్ట్రంలో డ్రగ్‌మాఫియా తీసుకొచ్చి విద్యార్థుల జీవితాలను జగన్‌ నాశనం చేస్తున్నాడని అన్నారు. ప్రజలను మత్తులో ఉంచి ఓట్లు దండుకోవచ్చన్న ఉద్దేశంతో భారీగా మత్తు పదార్థాలు వైసీపీ ప్రభుత్వం దిగుమతి చేస్తుం దన్నారు. ఎన్నికల్లో వైసీపీని ఘోరంగా ఓడించాలని పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం

ఉంగుటూరు: కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ది సాధ్యమని ఉంగు టూరు నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి పత్సమట్ల ధర్మరాజు అన్నారు. బాదంపూడిలో జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలతో కలసి ధర్మరాజు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గన్ని గోపాలం, జామి రాంబాబు, వంకిన వెంకటేశ్వరరావు, పంది రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దొంతవరంలో రంభ శేఖర్‌, సింగులూరి సుధీర్‌ ఆధ్వర్యంలో కాటి సుందరరావు, సూర్యచంద్రరావు, బొడ్డు రాజు, యాగం శ్రీను, తదితరులు జనసేనలో చేరారు. వారికి ధర్మరాజు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

బీజేపీ, జనసేన సమన్వయ భేటీ

జీలుగుమిల్లి: బీజెపీ టీడీపీ జనసేన పార్టీ సమన్వయంతో తనను గెలిపించాలని పోలవరం ఉమ్మడి అభ్యర్ది చిర్రి బాలరాజు అన్నారు. జీలుగుమిల్లిలో బీజేపీ, జనసేన ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. బీజెపీ టీడీపీ జనసేన పార్టీల సమన్వయ కృషితో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌ చాట్రాతి ప్రసాద్‌, మండల అధ్యక్షుడు కొండలపల్లి ప్రసాద్‌తో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు పసుపులేటి రాము చర్చించారు. ఆయా పార్టీ నాయకులు కోలా మధు, శాకమూరి సాయి, రూపా సత్యనారాయణ, దారా మధు, కక్కిరాల సునిల్‌, నూసా గెసాలం, కక్కి రాల రాము, పులగం సత్తిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:07 AM