Share News

వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:04 AM

రాష్ట్రంలో వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేసిన అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి అన్నారు.

వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం
వైసీపీ అరాచకాలు వివరిస్తున్న చంటి

జగన్‌ ప్రభుత్వాన్ని సాగనంపాలని కూటమి అభ్యర్థుల పిలుపు

ఏలూరు టూటౌన్‌, ఏప్రిల్‌ 12: రాష్ట్రంలో వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేసిన అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి అన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 31వ డివిజన్‌లో శుక్రవారం నిర్వహించారు. చంటి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావల్సిన అవశ్యకత ఉందన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా తనను గెలిపించాలని చంటి విజ్ఞప్తి చేశారు. శివప్రసాద్‌, కాశీనరేష్‌, కార్పోరేటర్‌ ఫృద్వీ శారధ, నాయుడు సోము, ధుళిపూడి రవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం 2వ డివిజన్‌ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించారు. శనివారపుపేట, హైస్కూల్‌లో ప్రజాగళం కార్యక్రమం జరిగింది. ఉమ్మడి పార్టీల అభ్యర్థులు, నాయకులు ఈశ్వరి, బలరామ్‌, గాది రాంబాబు, నాగం శివ తదితరులు పాల్గొన్నారు.

ముస్లిం యువత టీడీపీలో చేరిక

నగరంలో వందలాది మంది ముస్లిం యువత టీడీపీలో చేరారు. బడేటి చంటి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. టీడీపీ మైనార్టీలకు సముచిత స్థానం కల్పిం చిందన్నారు. అబ్దుల్‌ కరీం, మహ్మద్‌ ఫయాజ్‌, ఖాలిక్‌, ముహ్మద్‌ అలీ పాల్గొన్నారు.

మహిళల సంక్షేమానికి సూపర్‌ సిక్స్‌ పథకాలు

పెదవేగి: మహిళల సంక్షేమానికి సూపర్‌ సిక్స్‌ పథకాలు దోహదప డతాయని చింతమనేని వెంకట రాధారాణి అన్నారు. చింతమనేని ప్రభాకర్‌ సతీ మణి రాధారాణి బాపిరాజుగూడెంలో శుక్రవారం ఇంటింటికి తిరిగి టీడీపీ ప్రక టించిన సూపర్‌ సిక్స్‌ పఽథకాలను వివరించారు. బొప్పన సుధాకర్‌, సర్పంచ్‌ జోగి పెద పెంటయ్య, ఎంపీటీసీ మద్దాల సహదేవుడు, తలకొండ జమలయ్య, బొప్పన మార్కండేయులు, జోగి సత్యవతి, పులిచర్ల రాధిక, తాళం సూర్యావతి, వెలివెల వాణి, అత్తిలి సోమేశ్వరమ్మ, చలమాల సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో చేరికలు

ప్రత్తికోళ్లలంక గ్రామానికి చెందిన కొల్లేరు రాజన్న కమిటీ ప్రధాన కార్యదర్శి ఘం టసాల పాండురంగారావు, భలే గంగరాజు, సైదు ధర్మరాజు, భలే యశ్వంత్‌, మోరు రాజు, ఘంటసాల ప్రశాంతి, భలే కుమారి సహా పలు కుటుంబాలు వైసీపీని వీడి చింతమనేని సమక్షంలో టీడీపీలో చేరారు. కొల్లేరు గ్రామాల సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో టీడీపీలో చేరినట్లు వారు వివరించారు.

Updated Date - Apr 13 , 2024 | 12:04 AM