Share News

చీపురుగూడెం సచివాలయంపై టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు కట్టి నాయకుల నిరసన

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:47 AM

చీపురుగూడెం గ్రామ సచివాలయంపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సోమవారం తమ పార్టీ జెండాలు కట్టి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల తీరుపై నిరసన తెలిపారు.

చీపురుగూడెం సచివాలయంపై టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు కట్టి నాయకుల నిరసన
చీపురుగూడెం సచివాలయంపై పార్టీల జెండాలు కట్టి నిరసన

చాట్రాయి, జనవరి 8 : చీపురుగూడెం గ్రామ సచివాలయంపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సోమవారం తమ పార్టీ జెండాలు కట్టి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల తీరుపై నిరసన తెలిపారు. సుమారు ఇరవై రోజుల నుంచి గ్రామ సచివాలయంపై వైసీపీ జెండా ఎగు రుతోంది. స్థానిక ప్రతిపక్ష నాయకులు వైసీపీ జెండా తొలగించాలని సచివాలయ సిబ్బందిని కోరినా వారు స్పందించలేదు. దీనిపై డిసెంబరు 25వ తేదీన ‘ఆంధ్యజ్యోతి’లో ‘గ్రామ సచివాలయమా? వైసీపీ కార్యాలయమా?’ శీర్షికన కథనం వచ్చింది. మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో సోమ వారం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సోమవారం తమ పార్టీ జెండాలను కూడా కట్టి నిరసన తెలిపారు. ఇప్ప టికైనా సమస్య పరిష్కరించాలని అధికారులను డిమాండ్‌ చేశారు. నూజివీడు నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు చీకటి చెన్నారావు, మండల పార్టీ అధ్యక్షుడు మరిడి చిట్టిబాబు, టీడీపీ నాయకులు బొట్టు లక్ష్మణరావు, సుబ్బారావు, రవి కుమార్‌,దేవా, జనసేన నాయకులు పరసా గోపి, వంశీ, బీజేపీ నాయకుడు సిరిమళ్ళ కృష్ణయ్య పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:47 AM