Share News

ప్రజల చెంతకు అభ్యర్థులు

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:26 AM

జిల్లాలో పలుచోట్ల టీడీపీ, జనసేన అభ్యర్థులు ప్రజల చెంతనే ఉంటున్నారు. ప్రజా సంకల్పయాత్ర, పాదయాత్ర పేరిట ప్రజల్లోకి వెళ్లి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు.

ప్రజల చెంతకు అభ్యర్థులు
దెందులూరులో పార్టీలో చేరినవారితో చింతమనేని ప్రభాకర్‌

టీడీపీ, జనసేన అభ్యర్థుల పర్యటనలు

వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలో చేరికలు

నిడమర్రు, మార్చి 27: జిల్లాలో పలుచోట్ల టీడీపీ, జనసేన అభ్యర్థులు ప్రజల చెంతనే ఉంటున్నారు. ప్రజా సంకల్పయాత్ర, పాదయాత్ర పేరిట ప్రజల్లోకి వెళ్లి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు చేపడుతున్న పాదయాత్ర విజయవంతం కావాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజ నేయులు ఆకాంక్షించారు. పాదయాత్ర పోస్టర్‌ను ఎంపి అభ్యర్థి పుట్టా మహేష్‌ బుధవారం ఆవిష్కరించారు. ధర్మరాజు మాట్లాడుతూ గురువారం గణపవరం మండలం మొయ్యేరులో పాదయాత్ర ప్రారంభమై 30న పోల సానిపల్లెలో ముగిస్తామన్నారు. అనంతరం ద్వారకాతిరుమల ప్రయాణం ఉంటుందని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ముత్యాల స్వామి, అంబళ్ల విజయభాస్కర్‌, నిమ్మల దొరబాబు, వంగా రఘు, బాసిరాజు పాల్గొన్నారు.

వైసీపీ నుంచి భారీగా టీడీపీలో చేరికలు

దెందులూరు: వైసీపీ నుంచి పెద్ద ఎత్తున టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీ దెందులూరులో యిప్పిలి వెంకటేశ్వరావు, కొండ య్య చౌదరి, మహేష్‌ యాదవ్‌ .పార్టీ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి 200 మంది టీడీపీలో చేరారు. కొప్పుల వెలమ సంఘం రాష్ట్ర నాయకుడు సంపంగి వేణు గోపాల తిలక్‌, కొలుసు నాని, కాంట్రాక్టర్‌ దాసే శ్రీను, మేడూరి వెంకటేశ్వర రావు, పంచాయతీ వార్డు సభ్యులు, ఉప్పు తులసిరామ్‌ మరో 200 మంది మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారికి చింతమనేని టీడీపీ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. వైసీపీలో ఎస్సీ, బీసీలకు తగిన గుర్తింపు లేదని, తిరిగి అక్రమంగా ఎస్సీ ఎస్టీ, అట్రాసిటీ కేసులతో వేధిస్తున్నారని తిలక్‌ అన్నారు. కాంట్రాక్టర్‌ దాసే శ్రీను మాట్లాడు తూ తాను సచివాలయం, రైతుభరోసా కేంద్రం భవన నిర్మాణం చేపట్టానని, వైసీపీ ప్రజా వ్యతిరేక విఽఽధానాలపై విరక్తితో టీడీపీలో చేరానన్నారు. కార్యక్రమంలో మిల్లుబాబు, నాని, ఏనుగు రామకృష్ణ, తాత సత్యనారాయణ, పసుమర్తి మధు, శేషారత్నం, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు,

పెదపాడు: కార్యకర్తలకు ఎల్లప్పడూ అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. హనుమాన్‌ జంక్షన్‌లోని జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్‌ ఇంటి వద్ద జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు ఎన్‌డీఏ కూటమి విజయానికి కృషి చేయాలన్నారు. ఘంటశాల వెంకటలక్ష్మి సారథ్యంలో పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని జనసేన నాయకులు హామీనిచ్చారు.

కూటమి విజయం సాధించాలని పూజలు

ఏలూరు టూటౌన్‌: రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించాలని టీడీపీ అభ్యర్థి బడేటి చంటి పూజలు చేశా రు. 49వ డివిజన్‌లో వేణుగోపాలస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజ లు చేశారు. నెర్సు గంగరాజు, మాగంటి హేమసుందర్‌, ఇసుకపల్లి తాతా రావు, వందనాల శ్రీనివాస్‌, ఆర్నేపల్లి తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

భీమడోలులో జనసేన, టీడీపీ, బీజేపీ ప్రచారం

భీమడోలు: అర్జావారిగూడెంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనంలోకి ధర్మరాజు పేరుతో ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్ధించారు. భావితరాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టబోయే కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి వివరించారు. జనసేన అభ్యర్ధి పత్సమట్ల ధర్మరాజు, తెలుగుదేశం నాయకులు గన్ని నాగగోపాలరావు, టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:26 AM