Share News

పన్నుల మాఫీకి స్కెచ్‌

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:19 AM

జిల్లా వాణిజ్య కేంద్రంగా పేరు పొందిన పట్టణంలో ఆస్తి పన్ను మాఫీకి ఓ అధికారి ప్రణాళిక రచించారు. ట్ర స్ట్‌ పేరుతో రిజిస్ర్టేషన్‌ అయిన ప్రైవేటు ఆసుపత్రి సంబంధిత మున్సిపాలిటీకి రూ.3.2 కోట్లు బకాయిపడింది.

 పన్నుల మాఫీకి స్కెచ్‌

ఆసుపత్రి యాజమాన్యంతో

ఓ అధికారి రహస్య ఒప్పందం

ట్రస్ట్‌ ఆసుపత్రి బకాయి రూ.3.2 కోట్లు

ఫీజుల వసూళ్లు.. ఆరోగ్యశ్రీ ప్యాకేజీలు అమలు

గడచిన ప్రభుత్వం పన్ను చెల్లించాలంటూ నోటీసులు

అదే ఇప్పుడు మాఫీ చేసేందుకు అధికారి యత్నం !

(భీమవరం–ఆంధ్రజ్యోతి):

జిల్లా వాణిజ్య కేంద్రంగా పేరు పొందిన పట్టణంలో ఆస్తి పన్ను మాఫీకి ఓ అధికారి ప్రణాళిక రచించారు. ట్ర స్ట్‌ పేరుతో రిజిస్ర్టేషన్‌ అయిన ప్రైవేటు ఆసుపత్రి సంబంధిత మున్సిపాలిటీకి రూ.3.2 కోట్లు బకాయిపడింది. ట్రస్ట్‌ ఆసుపత్రిలో రోగుల నుంచి ఫీజులు వసూలు చేస్తారు. ప్రభుత్వం అమలు చేస్తు న్న ఆరోగ్యశ్రీ సేవల్లోనూ ప్యాకేజీలు తీసుకుంటారు. కరోనా సమయంలోనూ సదరు ట్రస్ట్‌ ఆసుపత్రిలో ప్యాకేజీలు తీసు కున్నారు. కొన్నేళ్ల నుంచి మున్సిపాలిటీకి చెల్లించాల్సిన ఆస్తి పన్నుపై ఆసుపత్రి యాజమాన్యం స్పందించడం లేదు. గత పాలకవర్గం నోటీసులు జారీచేసింది. ఆస్తి పన్ను చెల్లించాలని ఆదేశించింది. బకాయి విషయమై కౌన్సిల్‌ సమావేశంలోనూ చర్చసాగింది. ట్రస్టు ఆసుపత్రి పన్ను చెల్లించాల్సిందేనంటూ కౌన్సిల్‌ తీర్మానించింది. అప్పటి నుంచి ఈ విషయం నలుగు తోంది. పన్ను చెల్లింపు విషయమై న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో పన్ను రద్దుకు ఓ అధికారి కొన్నాళ్ల నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆసుపత్రి వర్గాలతో సంప్రదింపులు జరిపారు. ప్రస్తుతం పాలకవర్గం లేదు. ఇన్‌ ఛార్జ్‌ పాలనలో మున్సిపాలిటీ నడుస్తోంది. మునిసిపల్‌ ఇన్‌ ఛార్జ్‌ ఆమోదముద్ర వేస్తే పన్ను రద్దు అవుతుంది. ట్రస్ట్‌ ఆసు పత్రికి రూ.3.2 కోట్లు లబ్ధి చేకూరుతుంది. ట్రస్ట్‌ పేరుతో వ్యా పారం చేస్తున్న ఆసుపత్రికి పన్ను మినహాయింపు ఇవ్వకూడ దంటూ గత పాలకవర్గం తేల్చింది. ఇప్పుడు అధికారుల కనుసన్నల్లో పాలన కొనసాగుతోంది. దీంతో ఓ అధికారి పన్ను రద్దుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే మున్సిపాలిటీకి భారీ మొత్తంలో నష్టం వాటిల్లనుంది.

అధికారి తీరుపై..

మున్సిపాలిటీలో అధికారి వ్యవహరిస్తున్న తీరుపై అధికార పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. నియోజక వర్గానికి చెందిన ఒకే నేతకు సదరు అధికారి తలూపు తుంటారు. మిగిలిన నాయకులంటే పెద్దగా మన్నన ఇవ్వడం లేదు. మరోవైపు మున్సిపాలిటీలో అవినీతి పెరిగిందంటూ అంతా గగ్గోలు పెడుతున్నారు. అధికార పార్టీ నాయకులే సదరు అధికారి అక్రమాలపై బహిరంగంగా విమర్శలు గుప్పించారు. పట్టణంలో రహదారుల విస్తరణ లోనూ అవినీతి సాగిందంటూ అధికార పార్టీ శ్రేణులే ఆరోపిస్తున్నాయి. ఇటీవల పట్టణం లోని ఆరు వార్డుల్లో రోడ్లపై ర్యాంపులను తొలగించారు. దీనివల్ల రహదారుల విస్తరణ సాధ్యపడింది. ర్యాంపుల తొలగింపు కోసం మున్సిపాలిటీ వాహనాలు వినియోగించారు. దీనికోసం ఒక్కో వార్డులో దాదాపు రూ.6 లక్షల మేర బిల్లులు చెల్లించినట్టు సమాచారం. మున్సిపాలిటీ వాహనాలను వినియోగించి అంత పెద్ద మొత్తంలో సొమ్ములు ఎందుకు చెల్లిస్తున్నారంటూ వైసీపీ శ్రేణులే నిలదీస్తున్నాయి. ర్యాంపుల తొలగింపు విషయంలో మాత్రం అధికారుల చర్యలతో పట్టణంలో కాస్త మంచి స్పందనే వచ్చింది. వాహనాల

రాకపోకలకు సౌకర్యం కలిగిందన్న భావన వ్యక్త మైంది. ఇతర వార్డుల్లోనూ ర్యాంపులను తొలగించేందుకు ప్రణాళిక రచించారు. ఆక్రమంలో పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లిస్తున్నా న్న అపవాదును అధికారులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పట్టణంలో సుందరీకరణ పేరుతోనూ అధిక మొత్తంలో బిల్లులు చెల్లిస్తున్నారు. అధికార పార్టీ నేత వసూళ్లు కొంతయితే అ పేరుతో అధికారులు దండుకుంటున్నారు. బిల్లులు కూడా అధిక మొత్తంలో చెల్లిస్తున్నారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. తాజాగా పన్ను రద్దు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ అంతా కోడై కూస్తున్నారు.

Updated Date - Jan 30 , 2024 | 12:19 AM