Share News

బాదుడే బాదుడు

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:29 AM

గ్రామాలను బతుకుదెరువు కోసం పట్టణాలకు వస్తున్నారు. పిల్లల చదువుల కోసమని పట్టణాల్లో నివాసం ఉంటున్నారు.

 బాదుడే బాదుడు

తగ్గిన ఆస్తుల విలువ..

మౌలిక వసతులు కరువు

మంచినీటికి ఇబ్బందే..

ఐదేళ్లలో పట్టణాల అభివృద్ధి ఇదీ

గగ్గోలు పెడుతున్న జనం

పెరిగిన అద్దెలు

గ్రామాలను బతుకుదెరువు కోసం పట్టణాలకు వస్తున్నారు. పిల్లల చదువుల కోసమని పట్టణాల్లో నివాసం ఉంటున్నారు. సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు అధికంగా పట్టణాలకు చేరిపోతు న్నారు. అంతా అద్దె ఇళ్లల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఆస్తి పన్నులు పెంచేయడంతో యజమానులు ఇంటి అద్దెలను పెంచేశారు. గతంలో భీమవరంలో రూ.3 వేలకు చిన్నపాటి ఇళ్లు దొరికిపోయేది. ఇప్పు డు నెలకు రూ.6000 చెల్లిస్తే గానీ చిన్నపాటి ఇల్లు దొరకడం లేదు. వ్యాపారాల కోసం తీసుకునే అద్దెల షాపులను పెంచేశారు. వ్యాపారాలు లేవు. కానీ అద్దెలు ఆకాశాన్ని తాకాయి. అద్దెలు పెరిగిపోవడం తో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు తమకు వచ్చిన ఆదాయాన్ని ఇంటి కోసం వెచ్చించాల్సి వస్తోంది. సంక్షేమ పథకాలు గొప్పగా ఇచ్చేస్తున్నా మంటూ చెబుతున్న ప్రభుత్వం ఇలా ప్రజలపై భారం మోపే చర్యలకు పాల్పడుతోంది. కుటుంబా లపై ఆర్థిక భారం పడుతోంది.

మౌలిక వసతులు అంతంతే

ప్రజల నుంచి ఆస్తి పన్ను రూపంలో పెద్ద మొత్తంలోనే వసూలు చేస్తున్న ప్రభుత్వం ఆ తరహాలో మౌలిక వసతులు కల్పించడం లేదు. అధికార పార్టీ నేతలకు ప్రయోజనం చేకూర్చే తర హాలోనే కొద్దిపాటి అభివృద్ధి పనులను చేపట్టారు. పట్టణంలో రహదారులు, డ్రైనేజీలు అంతగా నిర్మిం చలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్‌ 2.0 పనులను చేపట్టలేకపోయారు. కాంట్రాక్టర్‌లకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు మం జూరు చేయకపోవడంతో పట్టణాల్లో అభివృద్ది పనులు అంతగా ముందుకు సాగలేదు. మున్సిపాలి టీల ఆదాయంపైన ప్రభుత్వం షరతులు విధించిం ది. పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌లకు బిల్లులు చెల్లిం చకుండా తాత్సారం చేసింది. ఫలితంగా కాంట్రా క్టర్‌లు పనులు చేపట్టేందుకు వెనకడుగు వేసే పరి స్థితి నెలకొంది. పట్టణాల్లో ముఖ్యమైన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయలేకపోయారు. తాగునీటి వసతులను మెరుగుపరచలేదు. ఎన్నడూ లేని విధంగా మంచి నీటి సరఫరా సమయంలో విద్యుత్‌ కోతలను అమలు చేస్తున్నారు. అయినాసరే శివారు ప్రాంతా లకు మంచినీరు సరఫరా కావడం లేదు. భీమ వరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. తణుకు సమ్మర్‌ స్టోరేజ్‌ లేకుండా పోయింది. వీటిపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. టీడీపీ హయాంలో పాలకొల్లు, తణుకు పట్టణాలకు ఖరారుచేసిన పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టలేకపోయింది. పన్నుల బాదుడుపై ఉన్న శ్రద్ధ మౌలిక వసతుల కల్పనలో కొరవడింది.

భీమవరంలో అత్యధికం

భీమవరం పురపాలక సంఘంలోనే అత్యధికంగా పన్నుల రూపంలో బాదే శారు. గతంలో భీమవరం మున్సిపాలిటీ ఆస్తి పన్ను ఆదాయం రూ.14 కోట్లు ఉండేది. ఇప్పుడది రూ.25 కోట్లకు చేరింది. చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. నీటి పన్నును పెంచేశారు.

ఆ తర్వాత స్థానంలో తాడేపల్లిగూడెం ఉంది. ఇక్కడ ఏడాదికి రూ.9 కోట్లు పన్ను వసూలు చేయడం కష్టమయ్యేది. ఇప్పుడు ఆస్తి పన్ను ఆదాయం ఏకంగా రూ.15 కోట్లకు చేరింది. ఐదేళ్ల వ్యవధిలోనే ఇంతలా ఆదాయం పెరిగింది.

తణుకు పట్టణానిదీ అదే పరిస్థితి. తణుకులో ఆస్తి పన్ను ఆదాయం రూ.7 కోట్లు రావడానికి ఆపసోపాలు పడేవారు. ఇప్పుడది దాదాపు రెట్టింపయ్యింది. ప్రతి ఏటా రూ.13 కోట్ల మేర డిమాండ్‌ ఉంటోంది.

పాలకొల్లులో పన్ను ఆదాయం రూ.6 కోట్ల నుంచి రూ.10 కోట్లకు చేరింది.

నర్సాపురంలో రూ.4 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు రూ.6 కోట్లకు డిమాండ్‌ పెరిగింది. మొత్తంపైన జిల్లాలో ఆస్తి పన్ను గణనీయంగా పెరిగింది. ఆ ప్రభావం ఇతర రంగాలపైనా పడుతోంది.

Updated Date - Apr 24 , 2024 | 12:29 AM