Share News

‘తాపీ చెక్కిన శిల్పం’ పుస్తకం ఆవిష్కరణ

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:18 AM

రాజానగరం మండలం దివాన్‌చెరువు పరిధిలోని గైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగిన రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో భాగంగా సోమవారం వీరవాసరం మండలం నవుడూరు జంక్షన్‌కు చెందిన వడ్డీ సుబ్బారావు రచించిన తాపీ చెక్కిన శిల్పం రెండో ముద్రణను ఆవిష్కరించారు.

‘తాపీ చెక్కిన శిల్పం’ పుస్తకం ఆవిష్కరణ
తాపీ చెక్కిన శిల్పం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం

వీరవాసరం/ రాజమహేంద్రవరం, జనవరి 8: రాజానగరం మండలం దివాన్‌చెరువు పరిధిలోని గైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగిన రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో భాగంగా సోమవారం వీరవాసరం మండలం నవుడూరు జంక్షన్‌కు చెందిన వడ్డీ సుబ్బారావు రచించిన తాపీ చెక్కిన శిల్పం రెండో ముద్రణను ఆవిష్కరించారు. కళాశాల ప్రాంగణంలోని నన్నయ కళావేదికపై జరిగిన కార్యక్రమంలో తెలుగు మహాసభల కార్యదర్శి రెడ్డప్ప ధవేజీ, ముఖ్య సమన్వయకర్త కేశిరాజు రాంప్రసాద్‌, కడిమెళ్ల వరప్రసాద్‌, ఉపాధ్యక్షుడు, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్‌ నల్లమిల్లి శేషారెడ్డి, పాటల రచయిత రసరాజు తాపీ చెక్కిన శిల్పం రెండో ముద్రణను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత వడ్డీ సుబ్బారావును ఘనంగా సత్కరించారు.

Updated Date - Jan 09 , 2024 | 12:18 AM