Share News

తపనా దారెటు!

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:19 AM

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి పార్టీని వీడబోతున్నారా? తనకు ఏలూరు సీటు దక్కకుండా చేయ డమే కాకుండా తన బలాన్ని తక్కువగా అంచనా వేశారని, మదన పడుతున్నారా? వీలైతే తగినంత బలగాన్ని వెంటేసు కుని పార్టీని వీడి ఇండిపెండెంట్‌గా పోటీ చేయబోతున్నారా? అనే ప్రశ్నలకు ఆ పార్టీలో అత్యధికులు అవుననే బదులిస్తు న్నారు.

తపనా దారెటు!
పోలవరంలో పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న తపనా చౌదరి

పార్టీలో ఉంటూనే రగులుతున్న వైనం

సర్దుబాటుకు ప్రయత్నించని కమలనాథులు

బీజేపీ ఆవిర్భావం నాడే చౌదరి బలప్రదర్శన

ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకే సన్నాహాలు

(ఏలూరు, ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి పార్టీని వీడబోతున్నారా? తనకు ఏలూరు సీటు దక్కకుండా చేయ డమే కాకుండా తన బలాన్ని తక్కువగా అంచనా వేశారని, మదన పడుతున్నారా? వీలైతే తగినంత బలగాన్ని వెంటేసు కుని పార్టీని వీడి ఇండిపెండెంట్‌గా పోటీ చేయబోతున్నారా? అనే ప్రశ్నలకు ఆ పార్టీలో అత్యధికులు అవుననే బదులిస్తు న్నారు. ఏలూరు ఎంపీ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తే ఇక్కడి నుంచి పోటీ చేయడానికి వీలుగా గడిచిన కొన్నేళ్లుగా తపనా చౌదరి బలమైన పునాదులు వేసుకున్నారు. బీజేపీ పరిస్థితి అతంతమాత్రంగానే ఉన్నా సేవా కార్యక్రమాలను విస్తరిం చడం ద్వారా ఆయన ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. చాన్నాళ్లా పాటు పార్టీ కార్యక్రమాలకు వ్యయప్రయాసలను ఆయనే మోస్తూ వచ్చారు. ఆఖరికి ఉమ్మడి కూటమి పొత్తులో భాగం గా ఏలూరు ఎంపీ స్థానం లేకపోవడం సహజంగానే తపనా చౌదరితో పాటు బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులకు అసంతృప్తి కలిగించింది. పార్టీకోసం ఇన్నాళ్లు కష్టపడినా ఏలూరు కేంద్రంగా బహిరంగ సభలకు తానే ముందుండి నిర్వహించినా ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్‌గా అక్కడ కూడా పార్టీ పటిష్ఠతకు నిత్యం శ్రమించిన చివరికి మొండిచేయి మిగిలిం దన్న తీవ్ర అసంతృప్తితో చౌదరి రగిలి పోతున్నారు. తనను కలుస్తున్న పార్టీనేతలు, కార్యకర్తలతో ఇదే విషయాన్ని ఆయ న నిర్మోహమాటంగా వెల్లడిస్తూనే తాను ఏం చేస్తే బావుం టుందంటూ ప్రతిఒక్కరి నుంచి సమాధానం రాబట్టే ప్రయ త్నం చేశారు. ఉమ్మడి జాబితాలో ఏలూరు లేక పోవడం ఒక ఎత్తు అయితే తనకు సీటు రాకుండా పోయిందనే బాధలో ఉన్న చౌదరికి పార్టీ పరంగా ఓదార్పు కరువు అయినట్టు చెబుతున్నారు. తనకు ఎలాగో సీటు దక్కక పోవడం, పెద్దలు పట్టించుకోకపోవడం, ఇన్నాళ్లు పడిన కష్టానికి ఇదేనా పరిహారం అంటూ బాధపడుతూనే పార్టీ కార్యక్రమాల్లో తపనా చౌదరి పాల్గొంటూనే వచ్చారు. ఇదే క్రమంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవమైన శనివారం ఆయన కాస్తంత బల నిరూపణకు ప్రయత్నించారు. ఆయన పోల వరం నుంచి కైకలూరు వరకు 150 కి.మీ మేర శనివారం పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు సీనియర్లు పాలు పంచుకున్నారు. అడుగడుగునా పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తూనే ఇంకోవైపున అందరూ బాగున్నారా అంటూ ప్రశ్నలు సంధిస్తూనే ఆయన ముందుకు సాగుతూ వచ్చారు.

ఇండిపెండెంట్‌గానే బరిలోకి?

తన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా ముగించిన బీజేపీని విడనాడి, ఏలూరు ఎంపీ సీటుకు ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా తపనా చౌదరి పోటీ చేయబోతున్నారా? అనే ప్రశ్నకు దాదాపు అవుననే రీతిలోనే ఆయన వ్యవహారశైలి శనివారం అంతా సాగింది. కమలనాథులు ఎవ్వరూ కనీసం ఆయనకు మద్దతుగా నిలువక పోవడం, నిలిచినా ఆయన స్థితిగతులపై ఢిల్లీ వరకు సమాచారం తీసుకెళ్లలేక పోవడం వంటి అనేక అంశాలతో విసుగెత్తిన చౌదరి, ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. వీలైతే కొద్దిరోజుల వ్యవధిలోనే ఆయన బీజేపీకి బై చెప్పి ఎన్నికల రంగంలో దిగుతారని అంచనా వేస్తున్నారు.

Updated Date - Apr 07 , 2024 | 12:19 AM