Share News

583 ‘సువిధ’ అభ్యర్థనలకు అనుమతులు : కలెక్టర్‌

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:56 AM

జిల్లాలో ఎన్నికల ప్రచార అనుమతుల కోసం సువిధ / ఎన్‌కోర్‌ ద్వారా అందిన అభ్యర్థనల్లో ఇంతవరకు 583 అభ్యర్థనలకు అనుమతులు ఇచ్చినట్టు శుక్రవారం కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు.

583 ‘సువిధ’ అభ్యర్థనలకు అనుమతులు  : కలెక్టర్‌

ఏలూరు సిటీ, ఏప్రిల్‌ 5 : జిల్లాలో ఎన్నికల ప్రచార అనుమతుల కోసం సువిధ / ఎన్‌కోర్‌ ద్వారా అందిన అభ్యర్థనల్లో ఇంతవరకు 583 అభ్యర్థనలకు అనుమతులు ఇచ్చినట్టు శుక్రవారం కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. ‘జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమ లులోకి వచ్చిన వెంటనే కలెక్టరేట్‌లో జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. ఈ కేంద్రం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించాం. వేర్వేరు ఫిర్యాదు వేదికల ద్వారా అందిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ఎన్నికల ప్రచార అనుమతులు కోసం సువిధ ద్వారా గురువారం రాత్రి వరకు 862 అఽభ్యర్థనలు రాగా 583 అనుమతులు జారీ చేయగా, మరో 8 పరిశీలనలో ఉన్నాయి. సరైన రీతిలో దర ఖాస్తు చేయని 271 తిరస్కరించబడ్డాయి. సి–విజిల్‌ ద్వారా 259 ఫిర్యాదులు అందగా వాటిలో 162 ఫిర్యాదులను పరిష్కరించాం. మరో 97 ఎన్నికలకు సంబంధం లేని ఫిర్యాదులు తిరస్కరించబడ్డాయి. మీడియాలో ఎన్నికల ఉల్లంఘనలపై వచ్చిన 79 ఫిర్యాదులను పరిష్కరించాం. ఎన్నికలకు సంబంధించి అంశాలపై చర్యల కోసం వాట్సాఫ్‌ మెస్సేజ్‌/ ఫోటోల ద్వారా వాస్తవ సమాచారం ప్రజలకు అఽఽధికార యంత్రాగానికి అందించడానికి వాట్సాప్‌ నెంబర్‌ 94910 41435 అందుబాటులో ఉంచాం. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలి. ఫిర్యాదుల నమోదు కోసం కలెక్టరేట్‌ కాల్‌ సెంటర్‌ నెంబర్‌ 1800 233 1077 ఏర్పాటు చేశాం.’ అన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 12:56 AM