Share News

సర్వే సంబరాలు

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:44 AM

దేశవ్యాప్తంగా పోలింగ్‌ ముగిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా ఓటర్ల నాడిని ప్రతిబింబించే విధంగా ఎగ్జిట్‌పోల్స్‌ కుప్పలు తెప్పలుగా వెలువడ్డాయి.

సర్వే సంబరాలు

గోదావరి జిల్లాల్లో తిరుగులేదంటూ నిర్ధారణ

వైసీపీకి ఎక్కడా అడ్రస్‌ లేదంటూ ఇంకొన్ని సంస్థలు

రెండురోజుల్లో కౌంటింగ్‌... కౌంట్‌డౌన్‌

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

దేశవ్యాప్తంగా పోలింగ్‌ ముగిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా ఓటర్ల నాడిని ప్రతిబింబించే విధంగా ఎగ్జిట్‌పోల్స్‌ కుప్పలు తెప్పలుగా వెలువడ్డాయి. అత్యధిక సర్వే సంస్థలు తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కూడిన కూటమికి అనుకూలంగా ఫలితాలు వెలువరించాయి. అసెంబ్లీ, ఎంపీ స్థానాలు రెండింటిలోనూ కూటమి పైచేయి సాధించబోతున్నట్టు తమ సర్వే ఫలితాలను ఈ సంస్థలు బహిర్గతం చేశాయి. ఇంకోవైపు వైసీపీ స్వల్ప మెజార్టీతో గట్టు ఎక్కడం ఖాయమంటూ మరి కొన్ని సర్వే సంస్థలు ఫలితాలు ప్రకటించాయి.

దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్‌, వివిధ రాష్ర్టాల్లో జరిగిన పోలింగ్‌ ప్రక్రియ ఆసాంతం శనివారం సాయంత్రంతో ముగిసింది. ఆ ముగిసిన వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ బహిర్గతమ య్యాయి. ప్రత్యేకించి శనివారం నాడంతా ఈ పోల్స్‌లో ఎటు వంటి ఫలితాలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయోనన్న ఉత్కంఠతోనే అంతా ఆసక్తిని కనబరిచారు. ఇందుకు తగ్గట్లుగానే తమ నియోజకవర్గాల్లో పోలింగ్‌ నుంచి ఇప్పటి వరకు తమకు ఉన్న అంచనాలను తాజా సర్వే ఫలితాలతో బేరీజు వేసుకున్నారు. ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలో గడిచిన 2019 నాటి ఎన్నికల ఫలితాలు ఈసారి తిరగబడ బోతున్నాయంటూ అనేక సర్వే సంస్థలు ప్రకటించాయి. వాస్తవానికి ఎగ్జిట్‌ పోల్స్‌పై అత్యధికులు విశ్వాసంతో ఉన్న ఇప్పటికి తాము వేసిన అంచనాలకు అనుగుణంగానే ఫలి తాలు ఈనెల 4న వెలువడతాయనే ధీమాను వ్యక్తం చేస్తు న్నారు. కొన్ని పేరొందిన సర్వే సంస్థలు, మరికొన్ని సర్వేలను ఆదినుంచి నిర్దేశిస్తున్నా సంస్థలు ఏకబిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమిదే పైచేయి అన్నట్టుగా తెలిపాయి. ఏ పరిస్థితుల్లోనూ వైసీపీకి ఎక్కడ ఎడ్జ్‌కూడా లేదన్నట్టుగా సర్వే ఫలితాలు ఉన్నాయి. ఏలూరు లోక్‌సభ స్థానం పరిధి లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో సహా ఏలూరు పార్ల మెంట్‌లోనూ కూటమిదే పైచేయి అన్నట్లుగా మరికొన్ని సర్వే సంస్థలు నిర్దేశించాయి. ఇప్పటివరకు కొన్ని నియోజకవర్గాల్లో కూటమి, వైసీపీ పక్షాల మధ్య ఫీప్టీఫీప్టీ అన్నట్లుగా స్థాని కంగా ఫలితాలను అంచనా వేశారు. అయితే వీటన్నింటికి భిన్నంగా ఫలితాలు ఏకపక్షంగా ఉండబోతున్నాయంటూ ఆయా సర్వే సంస్థలు ప్రకటించడం విశేషం. ఎట్టి పరిస్థితు ల్లోనూ వైసీపీ అథఃపాతాళానికి చేరడం ఖాయమని తాము చెబుతూనే ఉన్నామని, దానికి అనుగుణంగానే ఎగ్జిట్‌ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని కొందరు నిర్ధారణకు రాగ లిగారు. ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలో ప్రతి నియోజక వర్గంలోనూ కూటమి వైసీపీ పక్షాల మధ్య హోరాహోరీగా పోరు సాగింది. పోలింగ్‌ రోజున ఆఖరి క్షణంలో మహిళా ఓటర్లు బారులు తీరి ఉండటం, అనుకూలత తమదే అంటే తమదేనంటూ ఒకవైపు కూటమి, మరోవైపు వైసీపీ లెక్కలు వేసుకున్నాయి. ఇదే తరహాలో కొన్ని సర్వే సంస్థలు వైసీపీ స్వల్ప మెజార్టీతో గట్టెక్కవచ్చని రాష్ట్రస్థాయిలో ప్రకటించాయి. జిల్లాల వారీగా సంఖ్యను క్రోడీకరించకుండా రాష్ట్రస్థాయిలోనే లెక్క కట్టారు. ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే తెలుగు దేశం పోటీ చేసిన స్థానాలతో పాటు కైకలూరులో బీజేపీ, పోలవరం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో పోటీ చేసిన జన సేన అభ్యర్థులు గెలుపు ఏకపక్షమేనంటూ దాదాపు అన్ని సర్వే సంస్థలు ఒక నిర్ధారణకు వచ్చాయి. ఇది కాస్త కూటమిలో మరింత విశ్వాసాన్ని పెంపొందించింది.

మరో రెండురోజుల్లో తేలిపోతోంది..

రాబోయే రెండురోజుల్లోనే ఓట్ల లెక్కింపు జరగనుంది. దీనికి అనుగుణంగానే అన్ని పార్టీలు ఇప్పటికే మానసికంగా సిద్ధపడ్డాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ తమకు అనుకూలంగా ఉంటే తాము ఆశించినట్లుగానే జరిగిందని, ఇరుపార్టీలు అను కూలురు సంబరాలు చేసుకుంటూ ఉండగా, తెలంగాణలో జరిగిన ఎగ్జిట్‌ పోల్స్‌ను ప్రస్తావిస్తూ ఈసారి కూడా కొంత మార్పులు, చేర్పులు ఉండవచ్చవంటూ ఇదంతా 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపుతో తేలనుందని, అభ్యర్థులంతా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే ఏజెంట్లకు పదేపదే శిక్షణలో మునిగి తేలుతున్నారు. ఇంకోవైపు ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు కూటమికి అనుకూలంగా ఉండడంతో కూటమి తరపున పోటీచేసిన అభ్యర్థుల శిబిరాల్లో హర్షాతి రేకం వ్యక్తమవుతోంది. ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్‌ యాదవ్‌ గెలుపు ఖాయమని అత్య ధికులు విశ్వసిస్తుండగా, దీనికి అనుగుణంగానే ఎగ్జిట్‌ పోల్స్‌ లోనూ సానుకూలత కనిపించిందని టీడీపీ భావిస్తోంది. కొన్ని ప్రత్యేకించి సర్వే సంస్థలు మినహా, మిగతా అత్యధిక సంస్థలన్ని కూటమి విజయం ఖాయమని తేల్చడంతో కౌంటింగ్‌ ప్రక్రియ సవ్యంగా సాగేలా వివిధపక్షాల అభ్యర్థు లంతా ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. ఏలూరు, ఉంగు టూరు నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నంలోపే వెలువడుతుందని భావిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఎన్నెన్ని రౌండ్లు లెక్కింపు పూర్తి చేయబోతున్నారో అధికారి కంగా ప్రకటించారు. ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలో మొత్తంమీద 21 రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారు. ఉంగుటూరు, ఏలూరు నియోజకవర్గాల్లో 16 రౌండ్ల చొప్పున పోలవరం, నూజివీడులో 21 రౌండ్ల చొప్పున ఒక్క కైకలూరులో 17 రౌండ్లు, చింతలపూడిలో 20 రౌండ్ల, దెందులూరులో 18 రౌండ్లతో ఫలితాలను ప్రకటిస్తారు. సాధ్యమైనంత మేర మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల్లోపే ఫలితాలు ఆసాంతం వెలువడేలా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారు. తదానుగుణంగానే అటు అధికార యంత్రాంగం, ఇటు రాజకీయపక్షాల ఏజెంట్లు కౌంటింగ్‌కు సిద్ధమవుతున్నారు.

Updated Date - Jun 02 , 2024 | 12:44 AM