Share News

గ్రంథాలయాల్లో విజ్ఞాన శిబిరాలు

ABN , Publish Date - May 26 , 2024 | 11:36 PM

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం ఆదివారం కొనసాగింది.

గ్రంథాలయాల్లో విజ్ఞాన శిబిరాలు
ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయం విజ్ఞాన శిబిరంలో విద్యార్థులు

వేసవి శిక్షణ శిబిరాలు

ఏలూరు టూటౌన్‌, మే 26: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం ఆదివారం కొనసాగింది. వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రిసోర్స్‌ పర్సన్‌లు డి.శ్రీవల్లి, జి.కల్యాణి, దుర్గాప్రసాద్‌ విద్యార్థులకు పలు అంశాల్లో శిక్షణనిచ్చారు. మైండ్‌ మెమొరి పవర్‌గేమ్స్‌, నీతి కథలు, సరదా గేమ్స్‌, బెలూన్‌, డిస్పోజల్‌ గ్లాస్‌లతో వెరైటీ గేమ్స్‌ ఆడిం చారు. వేసవి సెలవుల్లో ఖాళీ సమాయాన్ని వృథా చేయకుండా గ్రంథాలయా లకు వచ్చి విజ్ఞానాన్ని సముపార్జించుకోవాలన్నారు. డిప్యూటి లైబ్రేరియన్‌ నారాయణరావు, సందీప్‌కుమార్‌, అస్లాం భాష, కనకదుర్గ పాల్గొన్నారు.

ఏలూరు రూరల్‌: దయామణి మెమోరియల్‌ బ్లెస్సింగ్‌ మ్యూజిక్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం నెలరోజుల పాటు నిర్వహించారు. సంగీత వాయిద్య పరికరాలపై 270 మంది శిక్షణ పొందారు. శిక్షణ ముగింపు సందర్భంగా ఆదివారం ఏలూరు సీఎస్‌ఐ మైదానంలో సర్టిఫికెట్లను పాస్టర్‌ ఎం.జ్యోతిరాజు సతీమణి అందజేశారు. కార్యక్రమంలో పలువురు సంగీత దర్శకులు, గాయనీ గాయకులు పాల్గొన్నారు.

పెదవేగి: గ్రంథాలయానికి వెళ్లడం విజ్ఞానానికి బాట అని లైబ్రేరియన్‌ తోట అరుణ్‌కుమార్‌ అన్నారు. శాఖా గ్రంథాలయంలో ఆదివారం వేసవి విజ్ఞాన శిబిరంలో పలువురు విద్యార్థులు విజ్ఞానదాయక పుస్తకాలను చదివారు. గ్రంధపఠనంతో కలిగే లాభాలను అరుణ్‌కుమార్‌ వివరించారు. నిత్యం గ్రంఽథపఠనం చేస్తే భవిష్యత్‌లో మంచి విజ్ఞానవేత్తగా ఎదుగుతార న్నారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా గ్రంథ పఠనం చేయాలని, అదే వారి జీవితాన్ని ఉన్నత దిశగా నడిపిస్తుందని ఆయన తెలిపారు.

లింగపాలెం: ధర్మాజిగూడెం, లింగపాలెం శాఖాగ్రంథాలయాల్లోని వేసవి శిక్షణ తరగతుల కార్యక్రమం నిర్వహించారు. లైబ్రేరియన్‌ సీహెచ్‌ వెంకటరమణ విద్యార్థులకు పలు నీతి కథలు వినిపించారు. కథలు చదివిం చడం, రాయించడంతో పాటు నిజాయితీగా ఉండడంపై అవగాహన కల్పిం చారు. విద్యార్థులకు పద్యాలు, జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలు, జవాబులు నేర్పిం చారు. రీసోర్స్‌పర్సన్‌ ఏవీ నారాయణ గణితశాస్త్రంపై అవగాహన కల్పిం చారు. కార్యక్రమంలో ఎస్‌.ఏ లతీఫ్‌, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2024 | 11:36 PM